అర్థరాత్రి అలజడి.. చైనా వార్నింగ్ తో సైన్యం అలర్ట్ | Indian Army Sent More troops and Weapons to Border

More troops sent by india along china border

China, India, India China, India China Stand Off, Doklam plateau Issue, Doklam China India War Scene, Doklam Tensions, Indian Troops China Border

More Troops Sent Along China Border Caution Level Raised. Neither India nor China has shown any sign of backing off from a face-off that began nearly three months ago along the Sikkim border when Indian soldiers entered the Doklam plateau to stop the Chinese army from constructing a road.

బార్డర్ లో ఉద్రిక్తత.. భారత సైన్యం అలర్ట్

Posted: 08/12/2017 08:27 AM IST
More troops sent by india along china border

మూడు నెలలుగా డోక్లామ్ వివాదం కారణంగా భారత్-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, చైనా మీడియా వార్నింగ్ లు, అందుకు తగ్గట్లు భారత సైన్యం మోహరింపు కొనసాగుతుండగా, గత రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చైనా యుద్ధ సంకేతాల నేపథ్యంలో భారత్ మరిన్ని బలగాలను తూర్పు సరిహద్దు వెంబడి మోహరిస్తోంది. ఇరు దేశాల మధ్య గత రెండు నెలులుగా స్టాండాఫ్ కొనసాగుతుండగానే ఆయుధాలతో సిద్ధమవ్వటం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు శుక్రవారం తొలిసారి భారత్-చైనాకు చెందిన మేజర్ జనరల్ ర్యాంకు అధికారుల మధ్య సిక్కింలోని నాథు లా బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం) పాయింట్ వద్ద అత్యున్నతస్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఆగస్టు 8న ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్ల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో తాజా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ‘ఆపరేషనల్ అలెర్ట్ ఏరియాల్లోకి’ భారత దళాలు కదులుతున్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వరకు 4,057 కిలోమీటర్ల వ్యాప్తంగా భారత దళాలు సిద్ధంగా ఉన్నాయి. గురువారం భారత రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో మాట్లాడుతూ.. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దళాలు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  China  Doklam Issue  Army Stand Off  

Other Articles