Indian expat wins Dh500,000 house in Dubai ఎడారి దేశంలో భారతీయుడికి పట్టిన అదృష్టం

Indian expat wins dh500 000 house in dubai

Ubaidulla Neralakatte, Promoth Manghat, CEO of UAE Exchange Group, Mega Prize, 'Win a Home in Dubai', lucky winner, mangalore, Ubaidulla Neralakatte.

The door to good fortune opened for 26 lucky participants as UAE Exchange, a global remittance firm, announced the winners of its recently concluded Summer Promotion 2017 'Win a Home in Dubai'.

ఎడారి దేశంలో భారతీయుడికి పట్టిన అదృష్టం

Posted: 08/01/2017 06:35 PM IST
Indian expat wins dh500 000 house in dubai

పొద్దున్నే ఫోన్ చేసి దాదాపు కోటి రూపాయలు విలువ చేసే ఇంటిని మీరు గెలుచుకున్నారని ఎవరైనా చెబితే.. మీ స్పందన ఎలా వుంటుంది. ఒక్కేసారి మీ మొహంలో వెయి వోల్జేజీల విద్యుత్ కాంతి ప్రజ్వలించినట్లు వుంటుంది కదూ. ఆ అవధులు లేని అనందంలో నోట మాట కూడా రాదు. అల్లంత ఎత్తున ఎక్కి దూకాలని, గట్టిగా అరవాలని, తన అనందాన్ని పంచుకునేందుకు తహతహలాడుతుంటారు. ఆ తరువాత ఇది నిజమేనా... అని మరోమారు నిర్థారించుకుంటారు. ఇక మీ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందామా..? అని వేచిచూస్తారు కదూ.

అచ్చంగా ఇలాంటి అనుభూతిని, అనుభవాన్ని ఎదుర్కోన్నాడు మన భారతీయుడు. అదేంటి అలా సంభోధిస్తున్నారని అనుకుంటున్నారా..? అవును మన దేశంలో ఇది జరిగివుంటే అది విచిత్రమేమి కాదు.. కానీ దేశం కాని దేశంలో.. అందులోనూ ఏడారి దేశంగా ప్రఖ్యాతి గాంచిన దుబాయ్ లో ఓ భారతీయుడ్ని అదృష్టం వరించింది. కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు చెందిన ఉబయ్‌దుళ్లా నీరలకంటే.. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అతనికి ఒకేసారి కోటి రూపాయల లాటరి తగిలిటనట్టుగా అదృష్టవార్త ఉదయాన్నే చెవిన పడింది. దీంతో తన ఆనందానికి అవధులు లేవని చెప్పాడు.

 చిన్నప్పటి నుంచి ఎన్నాడూ ఏది గెలుచుకోలేదని చెప్పాడు.యుఏఈ ఎంక్చెజ్ వారు సమ్మర్ ప్రమోషన్‌లో భాగంగా 'విన్ ఎ హోమ్ ఇన్ దుబాయ్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారని అందులో తాను మొదటి లక్కీ విన్నర్‌గా ఎంపిక కావడం నమ్మలేకపోయానని తెలిపాడు. 5 లక్షల(రూ.87లక్షల 22వేలు) విలువ చేసే ఇంటిని గెలుచుకున్నానని చెబుతున్నాడు. మొత్తం అయిదుగురు లక్కీ విన్నర్స్‌ని ఎంపిక చేస్తే అందులో తనకు మొదటి బహుమతి వచ్చిందని తెలిపాడు. మిగతా నలుగురికి 10 దరమ్‌లు విలువ చేసే బహుమతులు అందజేశారని అతడు చెప్పాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles