గెలిచెవరో తెలుసు.. కానీ, క్రాస్ ఓట్ల కథేంటి? | Presidential Election Counting All Eyes on Cross-Voters

Presidential election 2017 counting starts

Presidential Election 2017, India Presidential Election 2017, India Presidential Election Counting, Presidential Election Counting, Presidential Election Cross Voters, India New President

Ram Nath Kovind Set To Win As President Votes Are Counted. But, All Eyes on Cross Voters.

రాష్ట్రపతి రిజల్ట్.. కళ్లన్నీ క్రాస్ ఓట్ల పైనే!

Posted: 07/20/2017 09:02 AM IST
Presidential election 2017 counting starts

భారతదేశానికి తర్వాతి రాష్ట్రపతి ఎవరో నేడు తేలిపోనుంది. ప్రణబ్ పదవీకాలం ముగియటంతో పోటీలోకి దిగిన ఎన్టీయే, యూపీఏ అభ్యర్థులు ఎన్నికలో పాల్గొనగా, నేడు ఫలితాలను ప్రకటించబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి కౌంటింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆపై ప్రెసిడెంట్ పీఠాన్ని అధిష్ఠించేది ఎవరన్న ఉత్కంఠకు తెరపడనుంది.

తొలుత పార్లమెంటు భవనంలోని బ్యాలెట్ పెట్టెను తెరుస్తామని, ఆ తర్వాత అల్ఫాబెట్ ఆర్డర్‌లో మిగతా రాష్ట్రాల పెట్టెలను తెరిచి లెక్కించనున్నట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపాడు. మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని, సాయంత్రానికి పూర్తి ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 4896 మందికి ఓటుహక్కు ఉండగా సోమవారం జరిగిన పోలింగ్‌లో 99 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఈనెల 25 ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే ఎన్నికల్లో మెజార్టీ మద్ధతు రామ్ నాథ్ కోవింద్ కే ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, ఇప్పుడు అందరి కళ్లు క్రాస్ ఓటింగ్ మీదే ఉంది. తమ ఆజ్నను ధిక్కరించి ఎవరెవరూ వ్యతిరేఖ ఓట్లు వేసుంటారా? అన్న అంశాన్ని పరిశీలించేందుకు పార్టీలు సిద్ధమైపోతున్నాయి. కానీ, దీనిని ఆధారంగా చేసుకుని వారిపై చర్యలు తీసుకునేందుకు ఛాన్సే లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థికే ఓటు వేయాలన్న రూల్ ఏం లేదు. దీనిపై విప్ జారీ చేసే అధికారం కూడా చట్టంలో లేకపోవటంతో అభ్యర్థుల్లో నచ్చిన వారికి ప్రజా ప్రతినిధులు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కేవలం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మరోసారి పార్టీ వ్యతిరేక చర్యకు పాల్పడితే అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Presidential Election 2017  Ram Nath Kovind  Meira Kumar  

Other Articles