China moves troops, lots of heavy war equipment to Tibet టిబెట్ కు అర్మీని, యుద్దవాహనాలను తరలించిన చైనా..

Amid dokalam stand off with india china s pla moves military vehicles equipment into tibet

China, Tibet, Peoples Liberation Army, Dokalam, Sikkim, Bhutan, Tibet, War, army, army vehicles, army ammunition, indian military, South China Morning Post, People’s Liberation Army (PLA) Daily, military equiments

China, Tibet, Peoples Liberation In the wake of an Army face-off and chill in ties with India over Dokalam stand-off, China has moved tens of thousands of tonnes of military vehicles and equipment into Tibet, report said on Wednesday.

టిబెట్ కు అర్మీని, యుద్దవాహనాలను తరలించిన చైనా..

Posted: 07/19/2017 02:09 PM IST
Amid dokalam stand off with india china s pla moves military vehicles equipment into tibet

డ్రాగన్ దేశం భారత్ తో యుధ్దానికి సన్నధమవుతుందా..? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. సిక్కిం సరిహద్దులోని డోక్లాం వివాదంతో ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చించుకుంటే మంచిదని ఏకంగా అగ్రరాజ్యం చెప్పినా.. వాటిని పెడచెవిన పెట్టి మరీ తీవ్రపరిణామాలు కలిగించే యుద్దానికే చైనా మొగ్గుచూపుతుంది. సరిహద్దు నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని లేదంటే సమస్యకు యుద్ధమే పరిష్కారమని పదే పదే హెచ్చరికలు చేసిన చైనా.. ఇక అ దిశగా అడుగులు కూడా వేస్తూ.. తన సైన్యాన్ని, భారీగా మిలిటరీ ఆయుధాలను, పరికరాలను టిబెట్ కు తరలించినట్లు కథనాలు వస్తున్నాయి.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైన్యంతో పాటుగా వేల టన్నుల కొద్ది మిలిటరీ పరికరాలు, ఆర్మీ వాహనాలను గత నెల చివర్లోనే డ్రాగన్ దేశం టిబెట్ కు తరలించినట్లు హాంకాంగ్ కు చెందిన దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొనడంతో ఇది కాస్త చర్యనీయాంశంగా మారింది. రోడ్డు, రైలు మార్గం ద్వారా యుద్ద సామాగ్రిని, యుద్ద వాహనాలను తరలించినట్లు వెల్లడించింది. భారత్ తో సమస్యను పరిష్కారం కాని పక్షంలో యుద్దాన్ని ప్రకటించే యోచనలో చైనా వుందని, అందులో భాగంగానే సైన్యాన్ని టిబెట్ కు పంపించినట్లు హాంకాంగ్‌ మీడియా తన కథనంలో పేర్కొంది.

ఈ విషయాన్ని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మీడియా పీఎల్ఏ డెయిలీ కూడా ధ్రువీకరించడంతో ఇక ఇరు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటాయా..? అన్న అందోళన కూడా రేకెత్తుతుంది. కాగా, యుద్దానికి సన్నధం అవుతున్నారన్న వాక్యలను చైనా సైన్యం కమాండర్ ఒకరు తోసిపుచ్చారు. దౌత్యపరమైన చర్చలకు కూడా మిలిటరీ సిద్ధంగా ఉండటం అవసరమని ఆయన చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తుంది. అయితే భారత్ మాత్రం ఇప్పటికీ శాంతియుత పరిష్కరాన్నే కోరుకుంటున్నామని, డోక్లాం వివాదంలో దౌత్యపరమైన చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Tibet  Peoples Liberation Army  Dokalam  Sikkim  Bhutan  Tibet  War  India  

Other Articles