Telangana Woman Collector Refuses MLA's apology

Case files on mla shankar naik

MLA Shankar Naik, Shankar Naik Preethi Meena, Collector Preethi Meena, MLA Misbehave with Collector, MLA Touch Woman Collector, Shankar Naik Sorry, Preethi Meena Case, Case File TRS MLA, TRS MLA Misbehave Collector, Telangana Leaders Insult Collectors, CM KCR Preethi Meena Issue, KCR Shankar Naik, Telangana MLA Collector Preethi Meena

Case Files on MLA Shankar Naik over Misbehaving with Collector Preethi Meena after KCR warn. Collector Refuses MLA's apology even he explained not intentionally touched her.

ITEMVIDEOS:సారీ చెప్పినా కలెక్టర్ కనికరించలేదు

Posted: 07/13/2017 09:47 AM IST
Case files on mla shankar naik

కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. సీఎం ఆదేశాలు, సీనియర్ నేతల జోక్యం మేరకు కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఆయన తన రెండు చేతులు జోడించి మీనాకు సారీ చెప్పేశాడు. అయితే, ఆయన కలెక్టర్ మాత్రం దానికి ఏ మాత్రం స్పందించలేదు. పైగా ఆయనపై కేసు నమోదు చేయటం గమనార్హం.

కలెక్టర్ ను అవమానపరిచిన ఘటనలో బానోతు శంకర్ నాయక్ పై ఐపీసీ సెక్షన్లు 353, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోగా, స్టేషన్ బెయిల్ మంజూరు అయినట్లు సమాచారం. ప్రీతిమీనా జబ్బను తట్టి దురుసుగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులో నమోదయ్యింది. నేడు ఈ విషయమై ముఖ్యమంత్రిని కలిసి ఆమె మరోసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

 

‘కలెక్టర్ నా సోదరి లాంటిది..అనుకోకుండా ఆమెకు నా చేయి తాకింది. అయినా, క్షమాపణలు చెప్పాను’ అని శంకర్ నాయక్ మీడియాతో తెలిపాడు. అయినా ఆయన పై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాదు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు సింది. ఈ నేపథ్యంలో నేడు సంఘ
ప్రతినిధులు భేటీ అయి చర్చించనున్నారు.

నిన్న హరితహరం సందర్భంగా పక్కనే నిల్చున్న కలెక్టర్ ప్రీతి మీనా భుజంను ఎమ్మెల్యే పట్టుకున్న ఫోటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీనిపై కేసీఆర్ సీరియస్ అయ్యారని, సదరు ఎమ్మెల్యేను మందలించారని చెబుతున్నారు. కలెక్టర్ ను కలిసి క్షమాపణలు చెప్పని పక్షంలో పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Shankar Naik  Collector Preethi Meena  Misbehave Row  

Other Articles