Couple calls Off Wedding Because of Modi

Modi behind wedding cancel

Modi, Modi Wedding Cancel, PM Modi Reason Wedding, UP Couple Calls Off, Modi Cancel Marriage, Couple Argue over Modi, Indian Couple Calls Off Marriage, Indian Couple Calls Off, Indian Wedding Calls Off, Bizarre reason Wedding Calls Off, UP Bride and Groom Modi

Another Bizarre reason for Indian Wedding Cancel. UP Couple calls off wedding because of fight over PM Narendra Modi's Economical Changes.

మోదీ మూలంగానే ఆ పెళ్లి ఆగిపోయింది

Posted: 07/12/2017 11:29 AM IST
Modi behind wedding cancel

చిన్న చిన్న కలతలు చెలరేగి కాపురాలు కుప్పకూలిపోతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి పీటల మీద ఉండగానే చిన్న చిన్న కారణాలతో కూడా బంధాలు ఒక్కటి కాకముందే బద్ధలయిపోతున్నాయ్ కూడా. కానీ, ఇక్కడ వైవాహిక జీవితానికి ఏమాత్రం సంబంధం లేని వ్వవహారంతో పెళ్లినే రద్దు చేసుకుంది ఓ జంట. ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ పెట్టిన చిచ్చు ఏంటో తెలియాలంటే ఇది చదవండి.

లక్నోలోని ప్రభుత్వోద్యోగినికి కాన్పూర్ కు చెందిన వ్యాపారవేత్తతో వివాహం కుదిరింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా. అయితే వివాహానికి ముందు అభిప్రాయాలు పంచుకునేందుకు ఇద్దరూ ఒక గుడి దగ్గర కలుసుకున్నారు. ఈ క్రమంలో వివిధ విషయాలపై చర్చించుకుంటున్న దశలో రాజకీయాలతో పాటు మోదీపైకి టాపిక్ మళ్లింది. మోదీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి చాలా ప్రయోజనకరమని ఒకరు, లేదు దాని వల్ల పెద్ద దెబ్బ అంటూ మరోకరు ఇలా వాదించుకున్నారు. అది చిలికిచిలికి చివరకు వాగ్వాదంగా మారింది.

తమ అభిప్రాయాలు కలవటం లేదన్న నిర్ణయానికి వచ్చిన ఆ జంట పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహానికి వాగ్వాదానికి దిగిన విషయానికి ఏమాత్రం సంబంధం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అవేవీ పట్టించుకోని సదరు యువతీ యువకులు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఇలాంటి రీజన్స్ తో గొడవపడి వివాహం రద్దుచేసుకోవడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  UP Couple  Calls Off Marriage  

Other Articles