Ramnath Kovind as NDA Candidate for Presidential Election

Bjp declared its presidential candidate

Bihar Governor President, Ramnath Kovind, Ramnath Kovind Presidential Candidate, Ramnath Kovind as President, Ramnath KovindHistory, Ramnath Kovind NDA President Candidate, Amit Shah Ramnath Kovind, Ramnath Kovind Dalit President, Congress Ramnath Kovind

Bihar Governor Ramnath Kovind Officially announced as NDA Presidential Candidate. After BJP Parliamentary Meeting BJP Chief Amit Shah announced his Name.

అఫీషియల్: ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్

Posted: 06/19/2017 02:41 PM IST
Bjp declared its presidential candidate

15వ రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 12 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

దళితుల హక్కుల కోసం పోరాడిన రామ్ నాథ్... బీజేపీలో కీలకమైన దళిత నేతగా ఎదిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఆయన న్యాయవాదిగా పని చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే నేపథ్యంలో, ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం నేడు భేటీ అయింది. అనంతరం రామ్ నాథ్ ను తమ అభ్యర్థిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో ప్రకటించారు. 1945 అక్టోబర్ 1న దేరాపూర్ (కాన్పూర్, యూపీ) లో ఆయన జన్మించాడు. ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు కూడా.

మరోవైపు, పార్టీ సీనియర్ నేత అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనున్నట్లు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. శివసేన, ఆర్ఎస్సెస్ లు కూడా అందుకు అంగీకరించాయని చెప్పుకొచ్చింది నేషనల్ మీడియా. అయితే, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇంతవరకు రేస్ లో వినిపించని రామ్ నాథ్ పేరును అమిత్ షా ప్రకటించారు. దీంతో, అద్వానీకి చివరిసారిగా కూడా నిరాశే ఎదురైంది. బీజేపీలో అద్వానీ శకం ఇక ముగిసినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDA  President Candidate  Ramnath Kovind  Amit Shah  

Other Articles