Mumbai Cop's Son Arrested for Murdered His Mother

Deepali ganore murder case son arrested

Blood Note, Cop Son Kill Mother, Dyaneshwar Ganore Wife Killed, Dyaneshwar Ganore Wife Case, Deepali Ganore Murder Case, Deepali Ganore Son Siddhant, Cop Son Arrest, Cop Son Arrest for Murder Mother, Tired of her, catch me and hang me

Dyaneshwar Ganore who investigated Sheena Bora Murder Case Wife Deepali Ganore was Killed. Their Son uses her Mother's blood to write message ‘Tired of her, catch me and hang me’ daring his father to catch him. Later Siddhant Ganore arrested from Jodhpur.

అమ్మను పడుకోబెట్టేశా.. ఉరితీయండి

Posted: 05/26/2017 11:20 AM IST
Deepali ganore murder case son arrested

ముంబైలో జరగిన ఓ ఘాతుకం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓ పోలీసాఫీసర్ భార్యను అతికిరాతకంగా పొడిచి హత్య చేయటమే కాదు.. ఆమె రక్తంతో పట్టుకోమంటూ... రాసిన ఓ లేఖను అక్కడి ఉంచి వెళ్లాడు. దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కేసును దాదాపుగా ఛేదించేశారు. కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె కుమారుడు 21 ఏళ్ల సిద్ధాంత్ ను అరెస్ట్ చేశారు.

సంచలనం సృష్టించిన షీనా బోరా కేసును విచారించిన పోలీసాఫీసర్ ధ్యానేశ్వర్ గనోరే ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. ఆయన భార్య దీపాలి గనోరే గత బుధవారం వారుండే అపార్ట్ మెంట్ లో దారుణ హత్యకు గురైంది. విధులు పూర్తయి ఇంటికి తిరిగొచ్చిన ఆమె విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉండటంతో షాక్ కి గురయ్యాడు.ఆ పక్కనే ఓ పేపర్ మీద ఆమె రక్తంతో నోట్ రాసి ఉంది. ఆమెను పడుకోబెట్టేశా.. నన్ను పట్టుకుని ఉరి తీయండి అంటూ చివర్లో ఓ స్మైలీ కూడా రాసిన నిందితుడు ఆ కత్తిని శవం పక్కనే ఉంచాడు.

అయితే ఘటన జరిగిన తర్వాత గోనోరే దంపతుల తనయుడు సిద్ధాంత్ కనిపించకుండా పోయాడు. జోథ్ పూర్ కు పారిపోయి ఉంటాడని భావించిన పోలీసులు సిద్ధాంత్ ఫోటోలను పంపి అప్రమత్తం చేయగా, వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేపు ముంబైకి వచ్చాక దర్యాప్తులో సిద్ధాంత్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడోనని అంతా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Cop  Deepali Ganore Murder Case  Siddant Arrest  

Other Articles