Jailed MLA Caught on camera Abusing Police Officer

Ncp lawmaker warn police officer

NCP MLA Ramesh Kadam, NCP Jailed MLA, Jailed Leader Abuse Police, Abusive Language to Cop, MLA Scold Police, NCP MLA Abuse Police, Ramesh Kadam Cops Video, You Don't Know Who I Am, NCP MLA Ramesh Kadam, Maharashtra MLA Scold Cop, MLA Scold Jailer

Video of Mistreatment with policeman by former NCP MLA Ramesh Kadam. Police To Set Inquiry On Ramesh Kadam Using Abusive Language To Cops.

ITEMVIDEOS:ఏయ్... ఇంతకీ నేనెవరో తెలుసా?

Posted: 05/20/2017 10:16 AM IST
Ncp lawmaker warn police officer

అధికారం ఉందనే మదం పదవిలో ఉన్నప్పుడే కాదు.. అది పోయాక కూడా కొందరికి నెత్తిలో అలాగే ఉండిపోతుంది. చేసిందే పెద్ద తప్పు.. పైగా నెలల తరబడి జైలులో ఉన్నాడు. అయినా ప్రవర్తనలో ఇసుమంత కూడా మార్పు రాకపోగా, మరింత బలుపును ప్రదర్శించాడు. ఏకంగా ఓ పోలీస్ ఉన్నతాధికారిని ఎలా బెదిరించాడో ఇక్కడ చూడండి.

మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీకి చెందిన రమేష్ కదమ్ 300 కోట్ల స్కాంలో అరెస్టై 19 నెలలుగా బైకుల్లా జైల్లో ఉంటున్నాడు. గురువారం రోజు అతన్ని వైద్య పరిక్షల కోసం ఆస్పత్రికి తరలించేందుకు జైలు బయటకు తీసుకొచ్చారు. అయితే వాహనం కాస్త ఆలస్యం కావటంతో సహనం కోల్పోయాడు. అంతే పక్కనే ఉన్న పోలీసాఫీసర్ తో... ఏయ్ నేనేవరో నీకు తెలీదు.. నీ సంగతి చూస్తా, అవినీతి కేసులో నిన్ను ఇరికిస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

 

ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో అదంతా షూట్ చేయటం ప్రారంభించాడు. అది గమనించిన రమేష్ ఆఫ్ చేయాలంటూ ఆ యువకుడిని కూడా బెదిరించాడు. అన్నబాహు సాథే డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద వసూలు చేసిన నిధులు తన కంపెనీలలోకి మళ్లించాడంటూ రమేష్ కదమ్ పై ఆరోపణలు రావటంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది కూడా. అయినా ఇప్పుడు తన బుద్ధిని ఎన్సీపీ నేత మార్చుకోలేదని బీజేపీ ప్రతినిధి కిరీట్ సోమానియా చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCP MLA  Ramesh Kadam  Abuse Cop Video  

Other Articles