Lalu's son launched DSS to counter RSS

Lalu sons launched dss

Lalu Prasad Yadav Sons, Lalu Sons RSS, RSS DSS, Dharmanirpeksha (Secular) Sevak Sangh (DSS), DSS Meaning, DSS RJD, RJD Youth Wing, Bihar RSS, Lalu Sons Scam, Tej Pratap Petrol Bunk Scam, Petrol Pump Scam, Sushil Kumar Modi Lalu Sons, Lalu Beta Scams

Lalu Prasad Yadan Sons Tejaswi and Tej Prathap Yadav Launched DSS to Counter RSS. Sushil Kumar Modi Alleges irregularity in petrol pump allotment to Tej Pratap.

లాలూ కొడుకులు ఎంత పని చేశారంటే...

Posted: 05/06/2017 08:52 AM IST
Lalu sons launched dss

ధర్మ నిరపేక్ష(సెక్యులర్) సేవక్ సంఘ్ (డీఎస్ఎస్) ను ఆర్ఎస్ఎస్ కౌంటర్ గా ప్రారంభించాడు లాలూ తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీజేపీతో కలిసి మత ఛాందసవాదాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాపింపజేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆరెస్సెస్ బీహార్ లో వ్యాప్తి చెందనివ్వబోనని ఈ సందర్భంగా తేజస్వి ప్రతిన బూనాడు.

ఆర్ఎస్ఎస్ విభజన వాదంతో దేశంలో చిచ్చురేపుతోందని...బహిరంగ ప్రదేశాల్లోనూ, వ్యక్తిగతంగానూ పరుష పదజాలం ఉపయోగిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని, అలాంటి వాటికి చెక్ చెప్పేందుకు తన సోదరుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తో కలిసి తాను ఈ విభాగాన్ని రూపొందించామని అన్నారు. తమ విభాగం సాయంతో ఆరెస్సెస్‌ అఘాయిత్యాలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశాడు.

కాషాయ పార్టీ(బీజేపీని ఉద్దేశించి) నుంచి, ఆ పార్టీలోని సంకుచిత మనస్తత్వంగల నేతల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా ఇంకా గొప్పగా ఏమీ ఆశించలేమన్నాడు. ప్రశాంతంగా అన్నదమ్ముల్లా ఉన్న దేశ ప్రజల్లో చీలికటు తేవటమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. కేవలం హిందువులకు మాత్రమే మద్దతిస్తుందని, అలాగే ఇతర మతాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు అస్సలు సహకరించవని తెలిపాడు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా దానిని నిలువరించేందుకు డీఎస్ఎస్ ఏర్పాటు చేసినట్లు ఖరాఖండి ప్రకటన చేశారు ఆ ఇద్దరు సోదరులు.


వాళ్లిద్దరు దొంగలు: మోదీ

బీహార్ మాజీ ముఖ్యంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు తనయులు దొంగల ముఠా అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ తీవ్ర విమర్శలు చేశాడు. వాళ్లిద్దరూ(తేజస్వి, తేజ్ ప్రతాప్) అక్రమంగా కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారు. పాట్నాలో పెట్రోల్ బంకు పేరుతో చేసిన స్కాంకి సంబంధించి పత్రాలను మీడియా ముందు ప్రవేశపెట్టాడు. భూములు లేకుండా పెట్రోల్ పంపులను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాడు. కొడుకుల అక్రమాలకు తండ్రి వత్తాసు పలుకుతున్నాడు కూడా అంటూ మోదీ ఫైర్ అయ్యాడు. కాగా, అవినీతి ఆరోపణలపై ప్రశ్నించిన సందర్భంలో తన కొడుకులు పేదరికంలో చనిపోవటం ఇష్టం లేదని ఇంతకు ముందు స్వయంగా లాలూనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Lalu Prasad Yadav  RSS  DSS  Sushil Kumar Modi  

Other Articles