Two-year-old boy booked for molestation in Bihar వింత కేసు.. రెండేళ్ల చిన్నారిపై ఆ కేసులా..!

Two year old boy booked for molestation in bihar

theft case on 2 yearsl old, sexual assult case on 2 years old, bihar cops 2 years old, molestation case 2 years old, gold necklace 2 years old, bela baiju village two years old, two years old dalit boy, Minor, Molestation charge, Two-year-old accused, East Champaran, Bihar, Police, Bihar news, india news, crime news

The police station at Patahi village in Bihar’s East Champaran district where a molestation case has been registered against a two-year-old boy.

వింత కేసు.. రెండేళ్ల చిన్నారిపై ఆ కేసులా..!

Posted: 04/22/2017 12:46 PM IST
Two year old boy booked for molestation in bihar

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వుంది అక్కడి పోలీసుల నిర్వాకం. పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటం ఎరుగని కరుణామాయులే అన్న పాటను పాడి వుండరు.. కనీసం వినివుండరు. అందుకనే రెండేళ్ల చిన్నారిపై కేసు పెట్టారు. రెండేళ్ల బుడతడిని చూస్తే ఎవరికైనా చాక్లెటో, బిస్కెట్లో ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇక్కడి పోలీసులకు మాత్రం ముద్దుగా వున్న బుజ్జాయిపై కేసు పెట్టాలనిపించింది.

తల్లి ఒడిలో ఒలాలాడుతున్న పసివాడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ మీ అబ్బాయిమీద ఎప్ ఐఆర్ నమోడైంది. వెంటనే వచ్చి లొంగిపోమనండీ అంటూ అక్కడి పోలీసులు ఫోన్ చేయడంతో ఎవరో తెలిసినవాళ్ల పనేనని.. ఆటపట్టించేందుకు ఇలా చేస్తున్నారమోనని లైట్ గా తీసుకున్నారు. కానీ అది నిజమైన పోలీసుల నుంచే వచ్చిందని తెలుసుకుని గుండెలు బాదుకున్నారు. సరిగ్గా మాటలు కూడా రానీ పిల్లాడిపై మీద అలాంటి కేసులు నమోదు చేయడంతో నెట్ జనులు కూడా పోలీసుల వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు.

బిహార్‌ లోని చంపారన్ జిల్లా పతాహి పోలీసు స్టేషన్‌‌ లో ఒక వింత ఫిర్యాదు నమోదైంది. బేలా బైజూ గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గత నెల 15న కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడు తనను లైంగికంగా వేధించి, తన బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండేళ్ల బాలుడు లైంగిక వేధింపులకు దిగాడన్న దానిపై అంతా విస్తుపోతున్నారు.

రెండేళ్ల దళిత చిన్నారిపై ఇలాంటి కేసులు నమోదు చేయడంతో బీహార్ పోలీసులపై అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. పిర్యాదు చేసినవారు ఎలా చేసినా.. దానిని గుడ్డిగా నమోదు చేసి ఎప్ ఐఆర్ నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తీరును అటు ఉన్నతాధికారులు కూడా అక్షేపిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిపై దొంగతనం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడమేంటని నిలదీస్తున్నారు. అయితే పిర్యాదు చేసిన మహిళ భర్త ఎస్సీ ఎస్టీ అక్ట్రాసిటీ కేసులో దోషని, అయన చేసిన దాడిలో తమ తండ్రి తలకు తీవ్రగాయాలయ్యాని బాలుడి తండ్రి తెలిపాడు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మరో నిందితుడిగా వున్న గ్రామ పెద్ద సునీల్ కుమార్ తో కలసి సదరు మహిళ తమ బిడ్డపై దొంగతనం, లైంగిక వేధింపుల కేసు పెట్టందిని, దాని విచారణలో భాగంగా సిఐ కన్హయ్య ప్రపాద్ తన బిడ్డపై కేసు పెట్టి తనను వారిపై పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాడని తెలిపాడు. ఏకంగా మోతిహరి న్యాయస్థానం ఆవరణలోనే తనను కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా తెలిపాడు. కాగా ఈ విషయాన్ని ఏఎస్పీ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా గ్రామపెద్దతో పాటు తన కుమారుడిపై కేసు పెట్టిన మహిళపై కేసు నమోదు చేయాలని అదేశించినా.. వారు ఇంకా స్వేచ్చగా సంచరిస్తున్నారని బాధిత బాలుడి తండ్రి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minor  Molestation charge  Two-year-old accused  East Champaran  Bihar  Police  Bihar news  india news  crime news  

Other Articles