ఆదివారం బంకులు బంద్.. అయినా దొరక్కుద్ది.. ఎలాగంటే... | Fuel outlets to remain shut on Sundays.

No petrol and diesel on sundays in india

Petrol Pumps Bandh, Sunday Petrol, Fuel outlets India, Petrol and Diesel Holiday, Fuel bunks May 14, Fuel bunks Emergecy, Telangana Petrol Bunks, 2400 Telanagana Petrol Bunks

Petrol pumps to be closed on Sundays in seven states from 14 May.

పెట్రోల్, డీజిల్ బంద్.. కండిషన్స్ అప్లై

Posted: 04/19/2017 08:21 AM IST
No petrol and diesel on sundays in india

పెట్రోల్‌ బంకులు ఇక‌పై ఆదివారం విశ్రాంతి తీసుకోవటం ఖాయమైంది. మే 14న నుంచి ఈ నిర్ణ‌యాన్ని అమలు చేస్తున్న‌ట్లు పెట్రోల్‌ బంకు యజమానుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. పెట్రోలు వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా పని చేయటం కూడా ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు.

మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాము ప్ర‌తి ఆదివారం ఈ నిర్ణ‌యాన్ని అమలు చేయనున్నామని ఇండియన్‌ పెట్రోలియం డీలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు సురేష్‌ కుమార్ తెలిపాడు. నిజానికి కొన్నేళ్ల కిత్రం ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకుల‌కు సెల‌వు ఉండేద‌ని, అయితే, గతంలో కొన్ని ఆయిల్‌ కంపెనీల కోరటంతో ఆదివారం కూడా వాటిని నడపాల్సి వచ్చిందని వివరించాడు. ఇక‌పై మ‌ళ్లీ త‌మ పాత నిర్ణ‌యాన్నే అమలు చేయనున్నట్లు చెప్పాడు.

దీంతో మే 14వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పుదుచ్చేరి సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు పని చేయవు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బంకులు మూతపడనున్నాయి. త‌మ నిర్ణ‌యం వ‌ల్ల ఒక్క తమిళనాడులోనే దాదాపు రూ.150 కోట్ల నష్టం వస్తుందని, అయినప్పటికీ తప్పదని బంకు యజమానుల సంఘం తెలిపింది.

అయితే, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఒకరు ఆ రోజు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, అత్యవసర పరిస్థితి ఏర్పడిన సమయంలో మాత్రమే వారు పెట్రోల్ విక్ర‌యిస్తార‌ని పేర్కొంది. ఇక ఈ నిర్ణయంతో ఒక్క తెలంగాణలో 2400 బంకులు మూతపడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fuel Outlets  Sunday Holiday  May 14  

Other Articles