కేసీఆర్ ను ఆ మాజీ మంత్రి ఎంతలా ముంచేశాడంటే... | AP former minister Mudragada Praised KCR.

Mudragada praises telangana cm kcr

Mudragada Padmanabham, Mudragada Padmanabham KCR, Mudragada Padmanabham Chandrababu Naidu, Mudragada KCR Chandrababu, Chandrababu KCR, KCR Hikes Muslims Quota, Telangana Muslims Quota, KCR Manifesto, Mudragada KCR Manifesto, KCR Chandrababu differences, Telangana Reservations Quota

Former Minister, Kapu Leader Mudragada Padmanabham praised Telangana Chief Minister KCR in a open letter over hikes quota for Muslims and Manifesto implementation.

ముఖ్యమంత్రిని ముంచేసిన ముద్రగడ

Posted: 04/17/2017 11:07 AM IST
Mudragada praises telangana cm kcr

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించని రీతిలో మేనిఫెస్టో అమలు విషయంలో దూకుడు చూపిస్తున్నాడు కే చంద్రశేఖర్ రావు. ఓవైపు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంతోపాటు మరోపక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆరు నూరైనా అమలు చేసి చూపుతున్నాడు. కేంద్రప్రభుత్వంతో కయ్యం దువ్వటానికైనా సిద్ధమంటూ ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేయటం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించాడు.

కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ముద్రగడ ఓ లేఖ రాశాడు. ఎన్నికల మ్యానిఫెస్టో ఓ చిత్తు కాగితం కాదని మీరు మాత్రమే నిరూపించారంటూ అందులో పేర్కొన్నాడు. ‘‘ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల కోటాను పెంచుతూ, అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయం, మీకు అభినందనలు’’ అని తన లేఖలో పేర్కొన్నాడు. పదవులు, ఆస్తులు శాశ్వతం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యమని, ఆ పని చేసిన కేసీఆర్ పై గౌరవం మరింతగా పెరిగిందని చెప్పాడు. దళిత మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడంలో కేసీఆర్ సాగిస్తున్న ప్రయాణం మరువలేనిదని, ఓట్లు వేసిన ఓటర్లను గౌరవించాలన్న ఆయన ఉద్దేశం గొప్పదని చెప్పాడు.

ఇక ఇదే లేఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ కూడా అయ్యాడు. పదవులు, ఆస్తులే ప్రధానం అన్నట్లు తమ చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని, హామీలను నెరవేర్చాలని అడిగితే లాఠీలతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి బాధించడం వంటి పనులు చేస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. డబ్బులు పంచటం అనే నీచ సాంప్రదాయానికి తెర దించుతూ ఎన్నికలను నిజాయితీగా నిర్వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ముద్రగడ లేఖలో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  Telangana  CM KCR  Muslim Quota Hike  

Other Articles