ఇక పెట్రోల్ బంకులకూ టైమింగ్.. సెలవు కూడా! | Dealers threaten to restrict petrol sale to 8 hours daily.

Petrol pumps may remain shut on sundays

Petrol Pumps Weekly Off, Petrol pumps Strike, Petrol Pumps Dealers, Petrol Pumps May 14, Petrol Pumps Sunday, Petroleum Dealers, Petrol Bunk Timings

Petrol pumps threaten 'weekly off' every Sunday from 10 May as govt yet to decide on higher commission. Also threaten to restrict petrol sale to 8 hours daily.

ఇక ఆదివారం పెట్రోల్ బంకులు బంద్

Posted: 04/11/2017 09:14 AM IST
Petrol pumps may remain shut on sundays

వ్యాపారాల మనుగడ కోసం కమీషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ త్వరలో డీలర్లు కొత్త రకం నిరసనకు పిలుపునిస్తున్నారు. వచ్చే నెల అంటే మే 14 నుంచి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ ప్రకటించాడు.

అయితే కేవలం ఆదివారం ఒక్క రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా తమ నిరసన వ్యక్తం చేసే ఆలోచనలో వారు ఉన్నారంట. ఆదివారం పూర్తిగా బంద్, మిగతా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మాత్రమే తెరచి ఉంచాలని నిర్ణయించుకున్నాయి. తక్షణమే తమ డిమాండ్లను పరిశీలించి ఆమోదం తెలపకపోతే జరిగే పరిణామాలు ఇవేనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

అయితే దానికి మిగతా సంఘాల నుంచి పెద్దగా మద్ధతు లభించటం లేదు. మరోవైపు ఇంధన వినియోగం తగ్గించేందుకు ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసేయటమే మంచిదని గతంలో ప్రధాని మోదీ సూచించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా తమ స్వప్రయోజనాల కోసం 53,000 మంది డీలర్లు తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో కోట్లాది వాహన దారులకు కష్టాలు మాత్రం ఖాయమనే చెప్పవచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol Pumps  Sunday Weekly Off  May 14  

Other Articles