ఇండియన్ ఓపెన్ సిరీస్ లో సింధూ విజయభేరి.. India Open 2017: PV Sindhu outlasts caolina marin in final

India open 2017 pv sindhu outlasts caolina marin in final

PV Sindhu, Saina Nehwal, India Open Super Series, India Open, semi-finals, Sung Ji-Hyun, carolina marin, badminton, sports

PV Sindhu repeats Rio Olympics final against Spain's Carolina Marin, by beating in Indian open series

ఇండియన్ ఓపెన్ సిరీస్ లో సింధూ విజయభేరి..

Posted: 04/02/2017 08:55 PM IST
India open 2017 pv sindhu outlasts caolina marin in final

ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ అడుగుపెట్టి అప్రతిహాసంగా దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ తన ఖాతాలో తొలిసారి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను వేసుకుంది.  ఇప్పటివరకు ఈ సిరీస్ లో కేవలం సెమీఫైనల్స్ వరకు మాత్రమే పరిమితమైన సింధూ.. రెట్టించిన ఉత్సహాంతో అద్బుత ప్రదర్శన చేసి 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన  ఫైనల్ మ్యాచ్‌లో మన తెలుగు తేజం ఘన విజయం సాధించింది.

దీంతో సింధూ కెరీర్‌లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కాగా ఓవరాల్‌గా తొమ్మిదొవ టైటిల్. ఇదిలావుండగా, ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సింధూ ప్రతీకారం కూడా తీర్చుకుంది. రియో ఓలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదటి సెట్‌ను 21-19తో నెగ్గిన సింధూ సెకండ్ సెట్‌ను 21-16తో గెలిచి సత్తా చాటింది. దీంతో సింధూ ఇండియా ఓపెన్ డ్రీమ్‌ను నెరవేర్చుకుంది. ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉన్న సింధూ అగ్ర స్థానం దిశగా దూసుకెళుతోంది.

ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో విజయం సాధించిన సింధూపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సింధూను అభినందిస్తూ ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు యావత్ దేశంలోని నెట్ జనుల నుంచి ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. సోషల్ మీడియాలో సింధూ విజయం ప్రస్తుతం ట్రెడింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అటు రాజకీయ నేతల నుంచి కూడా సింధూకు అభినందనలు అందుతున్నాయి. సిందూ విజయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. ట్విట్టర్ వేదికగా సింధూకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలానే మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles