ఎమర్జెన్సీలో బంగారం ఇక అమ్ముకోలేమా? కొత్త రూల్స్ ఏంటంటే... | Sell gold for quick cash here is the rules.

No quick cash on gold sale

Gold Sale Instant Cash, Gold Sale India, India Gold Sale New Rules, Gold Sale Rules, Financial Bill 2017, Gold Selling, Indian Gold Shops, Instant Money on Gold

Getting instant money against sale of your household gold may become tougher from April 1. The government, in its amendment to the finance bill, has reduced the cash limit for sale against gold from Rs 20,000 to Rs 10,000 per person a day, which means that even if one needs money during an emergency, he cannot encash his household gold and get the money on the spot.

బంగారం అమ్మటం.. ఇక కష్టమే బాస్!

Posted: 03/31/2017 10:18 AM IST
No quick cash on gold sale

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం దాచుకున్న బంగారాన్ని అమ్మటం మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ జరిగేదే. అయితే కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబంధనతో బంగారం అమ్ముకోవటం ఇక కష్టతరంగా మారబోతుంది. క్యాష్ లెస్ ఇండియా పేరుతో ముందుకెళ్తున్న మోదీ సర్కార్ ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక బిల్లుకు కొత్తగా చేసిన సవరణ చట్టం ద్వారా బంగారం అమ్మగా నగదు రూపంలో తక్కువ సొమ్ము ఇచ్చే విధంగా మార్పులు చేసింది. 

ఒక వేళ మీరు బంగారం అమ్మితే రూ. 10 వేల లోపైతేనే నగదు చెల్లించవచ్చని, అంతకు మించి డబ్బు ఇవ్వాలంటే, చెక్కు లేదా ఆన్ లైన్ రూపంలోనే చెల్లించేలా కేంద్రం ద్రవ్యబిల్లులో భాగంగా ఓ చట్టాన్ని సవరించింది. ఇది రేపటి నుంచి, అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా, రూ. 10 వేలకు మించిన బంగారాన్ని అమ్మితే, చెక్కు లేదా ఆన్ లైన్ లో క్యాష్ జమ చేయాల్సిందే. అంటే, నెత్తిపై సమస్య కూర్చున్న వేళ బంగారాన్ని అమ్మితే, అది తీరే అవకాశాలు తగ్గుతాయి.

ఉదాహరణకు ఏదైనా ఆరోగ్య అవసరమో లేక అత్యవసరంగా ఎవరికైనా ఓ లక్ష చెల్లించాల్సి వస్తే, చెక్కు తీసుకుంటే అది క్యాష్ గా మారడానికి 2 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. ఇక ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ అనుకుంటే, దుకాణందారు డబ్బును కస్టమర్ ఖాతాలోకి వేసి, ఆపై అవతలి వ్యక్తి ఖాతాను ఎన్ఈఎఫ్టీ లేదా ఐఎంపీఎస్ లో యాడ్ చేసుకుని ట్రాన్స్ ఫర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇంతకు ముందు ఈ లిమిట్ 20 వేలు ఉండగా, ఇప్పుడు 10 వేలకు తగ్గించేశారు.

దీంతో పీకల మీదకు వచ్చిన కష్టాన్ని వెంటనే దూరం చేసుకునేందుకు బంగారం అమ్మకం ఎందుకూ పనికిరాదు. మరోవైపు ఈ విధానంతో తమకూ నష్టమేనని బంగారు వ్యాపారస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు బ్యాంకు ట్రాన్స్ ఫర్లు, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ల మీద అవగాహన ఉండకపోవటంతో ఇది పెను ప్రభావం చూపుతుందని ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్ అసోషియేషన్ డైరక్టర్ సౌరభ్ గాడిల్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Gold Sale  Less Quick Cash  

Other Articles