విమానంలో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే.. కాలిపోయింది.. Woman's headphone batteries exploded on flight

Plane passenger suffers burns as headphones catch fire on flight from beijing to melbourne

Air travel, flight, beijing, melbourne, headphones, burns, China, Headphones, aviation, Australia, Travel, World News

A woman has suffered burns to her face after her battery-powered headphones caught fire on a long-haul flight, travelling from Beijing to Melbourne, prompted warnings about the dangers of battery-operated devices.

విమానంలో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే.. కాలిపోయింది..

Posted: 03/15/2017 07:34 PM IST
Plane passenger suffers burns as headphones catch fire on flight from beijing to melbourne

విమానం ప్రమాదం అంటేనే ఎన్నో జాగ్రత్తలు.. మరెన్నో చెకింగ్స్ ఉంటాయి. అంతా ఓకే అన్నప్పుడే ఫ్లయిట్ లోకి ఎంటీ. ఊహించని ఘటన జరిగితే గాల్లోనే ప్రాణాలు గాల్లోనే కలుస్తాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చైనా రాజధాని బీజింగ్ నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న ఓ విమానంలో పేలుడు జరిగింది. పొగలు వచ్చాయి. 150 మంది ప్యాసింజర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఇంతకీ పేలింది ఏంటో తెలుసా.. చెవుల్లో పెట్టుకునే హెడ్ ఫోన్. అవును నమ్మలేని ఈ నిజం.. ఇప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. విమానాల్లోకి అయితే హెడ్ ఫోన్ అనుమతించాలా.. వద్దా అనే సందేహం పడ్డాయి విమానయాన సంస్థలు.

బీజింగ్ లో విమానం టేకాఫ్ అయిన అరగంటకు హెడ్ ఫోన్ లో పాటలు వింటూ నిద్రలోకి జారుకుంది మహిళా ప్యాసింజర్. ఒక్కసారిగా పెద్దగా శబ్దం. పొగలు వచ్చాయి. తీరాచూస్తే.. ఆ మహిళ మెడలోని హెడ్ ఫోన్ పేలింది. దీంతో దాన్ని కింద పడేసింది. అప్పటికే ఆమె ముఖం, మెడ నల్లగా మారిపోయింది. కమిలిపోయాయి. విమాన సిబ్బంది వెంటనే స్పందించి స్ప్రేతో మంటలు, పొగలను తీసేశారు. లిథియం బ్యాటరీల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇదివరకు సాంసంగ్‌ స్మార్ట్ ఫోన్ లు పేలడంతో విమానాల్లోకి తీసుకురావడాన్నిఅంతర్జాతీయ ఏవియేషన్ అధికారులు నిషేధించారు. ఇప్పుడు హెడ్ ఫోన్ లనూ నిషేధిస్తారేమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air travel  flight  beijing  melbourne  headphones  burns  China  Headphones  aviation  Australia  Travel  World News  

Other Articles