వామ్మో... ఆ టెలిఫోన్ బూత్ ఆత్మల కోసమేనంట! | This telephone booth lets you talk to the dead.

Phone booth in japan where people can call the dead

Japan Telephone Booth, Itaru Sasaki, Japan Telephone Booth, Telephone Booth Died People, Spirits, Telephone Booth, Japan Tsunami, Sasaki Telephone Booth, Ghost Telephone Booth

There’s a telephone booth in the town of Otsuchi in Japan, where many people go to talk to their loved ones who died during the 2011 tsunami.The idea for the phone booth was conceptualized by a man named Itaru Sasaki. Sasaki had lost his cousin in the tsunami, post which, he was overwhelmed with grief. To cope up with his loss, Sasaki installed the phone booth in his garden. He later decided that he should let others too to make use of the telephone booth.

ఆ టెలిఫోన్ బూత్ లో అంత స్పెషాలిటీ ఏముంది?

Posted: 03/15/2017 03:31 PM IST
Phone booth in japan where people can call the dead

దెయ్యాలు, దేవుడు ఉన్నాయా? అన్న విషయం పక్కనపెట్టి ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవటం లాంటి ఘటనలు బోలెడు చూసి ఉంటాం. కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం నిస్వార్థంగా ఆత్మలను వారి బంధువులతో కాంటాక్ట్ చేయిస్తున్నాడు. ఇంతకీ వాటితో ఎలా కమ్యూనికేట్ చేయిస్తున్నాడన్నదే గా మీ అనుమానం. అందుకోసం ప్రత్యేకంగా ఓ టెలిఫోన్ బూతును కూడా ఏర్పాటు చేశాడు.

జపాన్ లోని ఓట్సుచి నగరంలో ఓ టెలిఫోన్ బూత్ ఉంది. అందమైన గార్డెన్ చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ తో లోపల ఓ ఫోన్ తో ఇది ఉంటుంది. దీని ద్వారా చనిపోయిన తమ బంధువులతో మాట్లాడేందుకు వీలు ఉందంట. ఇంతకీ దీనిని ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు ఇటారు ససాకి. 2011లో సునామీ బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. సునామీ ధాటికి ఓట్సుచి పట్టణంలో 16 వేల మందికి పైగా స్థానికులు మృతి చెందారు. అందులో ఇటారు సోదరుడు కూడా ఉన్నాడంట. నిజానికి అతని కోసమే ఇలా ఓ ఫోన్ బూత్ ను ఏర్పాటు చేసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. అయితే తన లాగే తమ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులను కోల్పోయిన ప్ర‌జ‌లు తీవ్ర విషాదంలో ఉంటారు కాబట్టి వారి కోసం కూడా అలాంటిదే ఏదైనా చేయాలన్న ఆలోచనతో దీనిని డెవలప్ చేశాడు.

Japan Spirit Telephone Booth

చనిపోయిన వారితో మాట్లాడేందుకు చాటింపు వేయించాడు. అంతే ఇప్పటిదాకా మొత్తం 10 వేలకు పైగా కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటుండ‌డం విశేషం. చ‌నిపోయిన త‌మ‌వారికి త‌మ సంగ‌తులు చెప్పుకుంటున్న‌ట్లు భావిస్తూ ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. గాలి ద్వారా ఈ సందేశాలు వారి ఆత్మలకు చేరతాయన్న ఓ నమ్మకమే వారితో ఇలా చేయిస్తుందన్న మాట. కొందరు ప్రతీ రోజూ ఈ బూతుకు వస్తుంటే, మరికొందరు ఎప్పుడో ఒకసారి వస్తుంటారంట. తాను మాత్రం ఉదయం దానిని క్లీన్ చేసేందుకు మాత్రమే వెళ్తున్నానని ఇటారు చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Japan  Telephone Booth  Spirits  

Other Articles