పన్నీర్ సెల్వం ప్లేస్ లో కమల్ హాసన్... | Kamal Hassan replace Paneer Selvam,

Kamala hassan sensational comments on tamil nadu politics

Kamal Hassan Tamil Nadu politics, Kamal Hassan Jayalalithaa, Agni Paritchai, Kamal Hassan Agni Paritchai Interview, Kamal Latest Interview, Actor Kamal Hassan

Kamal Hassan in Puthiya Thalaimurai TV's Agni Paritchai Interview. Making Sensational Comments on Tamil Nadu politics.

ఈ ప్రభుత్వం ఎవరికీ అక్కర్లేదు: కమల్

Posted: 03/14/2017 08:54 AM IST
Kamala hassan sensational comments on tamil nadu politics

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరోసారి తమిళనాట రాజకీయాలపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుత అధికారంలో ఉన్న పళనిస్వామి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏర్పాటు అయిందని, ప్రభుత్వంలో ఉన్నవారిని తాను చికాకు పెడుతూనే ఉంటానని ఆయన హెచ్చరించాడు.పుదియ తలైమురై అనే టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలే చేశాడు.

తమిళనాడులో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా వారిని ప్రశ్నిస్తానని కమల్ అన్నాడు. నేతలు సినిమాల గురించి మాట్లాడినట్లే.. తాను రాజకీయాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశాడు. ఇక జయలలిత తనని ఎంతో టార్చర్ పెట్టిందన్న కమల్, 2013 లో ‘విశ్వరూపం’ సమయంలో తాను ఎదుర్కున్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నాడు. ‘‘నా సర్వస్వాన్ని పెట్టి నిర్మించా, ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ నాడు అన్నాడీఎంకే ప్రభుత్వం నిషేధించింది అంటూ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నాడు. జయలలిత వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డానని, విశ్వరూపం విడుదల కాకుండా ఆమె ఎన్నో ఆటంకాలు కల్పించిందని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నాడు.

ఇక రాజకీయాల్లోకి తనని తీసుకురావాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయన్న కమల్, తప్పులు చేసే ప్రభుత్వంపై ప్రజల్లో సహనం నశించిపోయి వ్యతిరేకత, ఆగ్రహాం పెరిగిపోతాయని చెబుతున్నాడు. ‘కాలానికి అనుగుణంగా రాజకీయనాయకులు మారాలి. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలి. నేను పళనికి, పన్నీర్ సెల్వంకో సపోర్ట్ కాదన్న కమల్ ద్రవిడ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పడానికి వీల్లేదని ఉద్ఘాటించాడు. తమిళ తల్లి ఆశీర్వాదం ఉన్నంత వరకు ద్రవిడ సిద్ధాంతం వర్ధిల్లుతూనే ఉంటుందన్నాడు. జాతీయ పార్టీలు రాష్ట్ర పాలనలో ప్రవేశించదలుచుకుంటే ద్రవిడ పార్టీలను ఢీకొనక తప్పదు అంటూ బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు చేశాడు.

జయ జీవితమే ఓ వివాదమయం అన్న కమల్ ఆయన చికిత్సపై గోప్యత ప్రదర్శించటం పలు అనుమానాలకు తావు ఇస్తోందని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కోరాడు. మొత్తానికి పన్నీర్ సెల్వం ఇంతకాలం చేస్తున్న డిమాండ్లనే కమల్ వినిపించటం కొసమెరుపు.  పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Kamal Hassan  Agni Paritchai Interview  Tamil Nadu Politics  

Other Articles