ఆన్ లైన్ టికెట్.. ఇక ఆధారే గతా? | Aadhar Card Mandatory to Book Rail Tickets Soon.

Aadhaar card will be must for booking train tickets online

Indian Railways, Aadhaar Railway Ticket, IRCTC, Rail Tickets Aadhaar, Aadhaar IRCTC, Aadhaar Mandatory, Online Reservations Aadhaar

Indian Railways is likely to put in place a system in which Aadhaar will be mandatory for booking tickets online, Railways could introduce Aadhaar-based ticketing system to stop touts from booking tickets in bulk, end fraudulent bookings and prevent cases of impersonation.

ఆన్ లైన్ టికెట్... ఆధార్ కంపల్సరీ!

Posted: 03/03/2017 09:23 AM IST
Aadhaar card will be must for booking train tickets online

కేంద్ర రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైలు టికెట్ల బుకింగ్‌లో పెరిగిపోతున్న మోసాలను అరికట్టడంలో భాగంగా ఇక నుంచి ఆధార్ ను తప్పనిసరి చేయనుంది. త్వరలో ఆన్‌లైన్‌లో చేసుకునే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ నంబర్ కంపల్సరీగా మారనుంది. రైల్వే సంబంధ నూతన వ్యాపార ప్రణాళిక 2017-18 ను గురువారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆవిష్కరించారు.

అందులో ఐఆర్‌సీటీసీ ద్వారా ఇంటర్నెట్‌లో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ నంబర్ నమోదం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. వయోవృద్ధులు టికెట్‌పై రాయితీ పొందాలంటే ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబరు సమర్పించాల్సి ఉంటుందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆరువేల పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్), వెయ్యి స్వీయ టికెట్ విక్రయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సరుకు రవాణాపై ఆదాయాన్ని పెంచుకునేందుకు రాయితీలు ప్రకటించింది. కొండ ప్రాంతాల్లోని స్టేషన్లను కలుపుతూ ప్రత్యేకంగా కొత్త రైళ్లను ప్రారంభించనుంది. 

తాజా ప్రణాళిక ప్రకారం..ప్రస్తుతం రైల్వేలో ఒక్కో సదుపాయానికి ఒక్కో యాప్ అందుబాటులో ఉంది.ఇకనుంచి అన్ని సేవలను ఒకేదాంట్లో అందించేలా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మే నెల నుంచి ఇది అందుబాటులోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IRCTC  Aadhaar Card  Online Reservations  

Other Articles