తస్మాత్ జాగ్రత్తా: నెత్తిపై నిప్పుల కొలిమి.. IMD predicts 'above normal' temperature

Imd predicts above normal temperature northwest region to be the worst affected

summer, summer heat, imd, indian meteorological department, temperature, weather forecast, summer forecast, heat wave, Telugu states

Several states are likely to witness heatwave conditions, the India Meteorological Department (IMD) said in its summer forecast for the season (March to May).

బీ అలర్ట్: భగ భగ కాదు.. భగ్గున మండేస్తానంటున్న భానుడు..

Posted: 03/01/2017 01:53 PM IST
Imd predicts above normal temperature northwest region to be the worst affected

భగ భగ మండే సూర్యుడు కాదు.. ఈ సారి వేసవితాపం తారాస్థాయికి చేరుకుని భగ్గుమనే భానుడి ఉగ్రరూపాన్ని చూస్తామా..? అంటే అవుననే సంకేతాలే కాదు హెచ్చరికలను కూడా జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సాధారణ వేసవి కాలం అనగానే భానుడు భగభగలను తట్టుకోలేని తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ఈసారి వేసవి సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికల నేపనథ్యంలో అత్యంత అఅప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత మనపై వుంది.

ముఖయంగా వేసవి సెలవుల్లో పిల్లలను బయట అడుకునేందుకు పంపడం మంచిది కాదు. ఇక పెద్దలు, నడివయస్కులు కూడా అత్యంత అవసరం అనుకుంటే తప్ప బయటకు వెళ్లరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేసవిలో భానుడు నిప్పులు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు. బయటకు వెళ్లే వ్యక్తుల తలపై నిప్పుల కొలిమి పెట్టినట్టుగా వుంటుందని భారత వాతావరణ శాఖ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల అధికారులు హెచ్చరిస్తున్నారు.

గత ఏడాది సాధరణానికి కొంచెం అటుఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. దానికి తోడు బలమైన వడగాల్పులు వీయడంతో దేశవ్యాప్తంగా ఏకంగా పదహారు వందల మంది మరణించగా, అందులో 700 మంది కేవలం వడగాల్పుల ధాటికే మరణించారని వాతావరణ శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ మరణాలు ఏకంగా నాలుగు వందలు వున్నాయంటే వేసవి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా వుందో అర్థమవుతుంది.

ఈ వేసవిలో కనీవిని ఎరుగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భానుడి భగభగలకు తోడు వడగాల్పులు కూడా తమ ప్రభంజనాన్ని చాటనున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 47 శాతం అధికంగా వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై స్పష్టత లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, అడవులు అంతరించి పోవడం, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. సో ఫ్రెండ్స్.. బీ కేర్ ఫుల్.. వడదెబ్బ మీ దరి చేరకమునుపే ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles