జయలలిత సమాధి వద్ద ప్రతీనబూనిన శశికళ sasikala pays tribute to jayalalithaa, swears at memorial

Sasikala pays tribute to jayalalithaa swears at memorial

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, palanisamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK General Secretary Sasikala paid floral tribute to Jayalalithaa at Chennai's Marina Beach before heading to Bengaluru court to surrender.

అమ్మ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులు, శపథం చేసిన శశికళ

Posted: 02/15/2017 12:37 PM IST
Sasikala pays tribute to jayalalithaa swears at memorial

అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశం ప్రకారం కర్ణాటకలోని దిగువ కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరుకు బయలు దేరారు. గత రెండు రోజులుగా గొల్డన్ బే రిస్టార్టులో వున్న అమె అత్యున్నత న్యాయస్థానం తక్షణం లొంగిపోవాలని అదేశించిన నేపథ్యంలో కోర్టులో లోంగిపోయేందుకు బెంగళూరుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అమె మూడు పర్యాయాలు ప్రతీణబూనారు.

గొల్గన్ బే రిసార్టు నుంచి బెంగళూరుకు బయలుదేరిన శశికళ మధ్యలో మెరినా బీచ్ లోని తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్దకు చేరుకుని అమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమె జయలలిత సమాధిపై మూడు పర్యాయాలు కొ్ట్టి శపధాలు చేశారు. అవేంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా పన్నీరు సెల్వానికి ముఖ్యమంత్రి పీఠం అందనీయకుండా అడ్డుకుంటానని అమె శపథం చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలావుండగా, అనారోగ్యం కారణంగా తనకు నాలుగు వారాల సమయం కావాలని శశికళ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆమె తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్మీడియట్లీ (తక్షణం) అనే పదానికి మీకు అర్థం తెలుసా? అంటూ సీరియస్ అయ్యారు. శశికళకు అనారోగ్య సమస్యలున్నాయని, అందుకే గడువు కోరారని చెప్పారు. దీనికి సమాధానంగా సుప్రీం తీర్పులో ఎలాంటి మార్పులు ఉండవని... శశికళ వెంటనే లొంగిపోవాల్సిందే అని జడ్జి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  swear  AIADMK  

Other Articles