చిన్నమ్మ కేసు.. అమ్మ మృతి మిస్టరీ లింకు ఉందా? | Sasiakala DA Case Effect on CM Chair.

Jayalalithaa niece deepa jayakumar comments on sasikala

VK Sasikala Natarajan, Panneerselvam, Deepa Jaya Kumar, Sasikala DA Case, Supreme Court Tamil Nadu Politics, Supreme Court Sasikala, Sasikala Panneeselvam, Deepa Jayakumar Sasikala, AIADMK General Secretary VK Sasikala, Disproportionate Assets Case

Sasikala DA case verdict likely on Tuesday: All eyes on Supreme Court as Tamil Nadu faces D-Day. Jayalalithaa Niece Deepa Jaya Kumar Comments on Sasikala behind Amma's Death.

దీప సంచలన వ్యాఖ్యలు... తమిళనాడులో హైటెన్షన్

Posted: 02/14/2017 08:14 AM IST
Jayalalithaa niece deepa jayakumar comments on sasikala

శశికళ ఏ క్షణాన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనుకుందోగానీ రాజకీయ సంక్షోభం కారణంగా వారం నుంచి రాష్ట్రంలో ఒకటే టెన్షన్. పరిస్థితులు క్షణ క్షణానికి మారిపోతుంటే.. ఏం జరుగుతుందా? అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. మరో రకంగా చెప్పాలంటే తమిళనాడు పరిస్థితి ఓ టైం బాంబులా తయారయ్యింది. ఈనేపథ్యంలో నేడు(మంగళవారం) అక్రమాస్తుల కేసులో శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని సంకేతాలు అందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 వేల మంది పోలీసులను మోహరించారు. ముఖ్యంగా శశికళ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టు చుట్టూ 600 మంది పోలీసులు కాపుకాయటం విశేషం.

‘చిన్నమ్మ’కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా, గవర్నర్ ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా శశికళ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ తమిళనాడు పోలీసు శాఖను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ నటరాజన్, చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ తదితరులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై, ఈరోడ్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మోహరించిన పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

అమ్మ మృతి కుట్ర వెల్లడిస్తా... దీప

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనక ఉన్న కుట్ర కోణాన్ని త్వరలోనే బయటకు వెల్లడిస్తానని ఆమె మేనకోడలు దీప జయకుమార్ వెల్లడించింది. తన నివాసంలో ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జయ మృతి వెనక దాగిన రహస్యాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. జయను నమ్మి, ఆమె వెన్నంటి నడిచిన కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. (దీప ఎంట్రీతో చిన్నమ్మకు సినిమానేనా?)  కొత్త పార్టీ పెట్టాలంటూ కార్యకర్తలు తనపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తనను నమ్మి వచ్చే ఎవరినీ నిర్లక్ష్యం చేయబోనని హామీ ఇచ్చారు. అత్తయ్య జయలలిత మృతి విషయంలో అనుమానాస్పద అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఏం జరిగిందో, ఆమెకు ఎటువంటి చికిత్స అందిందో ఎవరికీ తెలియదని దీప అన్నారు.

పన్నీర్ పై మళ్లీ ఫైర్

పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి వాళ్లను వెయ్యిమందిని చూసుంటానని పేర్కొన్నారు. దువ్వెన దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదన్నారు. ఎంతమంది మగాళ్లు వచ్చినా ఎదుర్కొనే దమ్ము తనకుందన్నారు. పన్నీర్ సెల్వం(ఓపీఎస్)తో డీఎంకే కుమ్మక్కయిందని, అందుకే తాను రంగప్రవేశం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితులకు పూర్తిగా బీజేపీ, డీఎంకేలో కారణమని ఆరోపించారు.

కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన శశికళ.. తాను సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయి ఉండేదాన్నన్నారు. తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని పేర్కొన్నారు. పదవులు తనకు గోధూళితో సమానమన్నారు. అయితే ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఓపీఎస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసిన తనకు, డీఎంకేకు ఓపీఎస్ సహకరిస్తున్నట్టు అర్థమైందన్నారు. అందుకే పార్టీని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నానని వివరించారు. ప్రాణాలు పోయినా పార్టీని నిలబెట్టుకుంటానని శశికళ స్పష్టం చేశారు. ఓపీఎస్ ద్రోహి అని, వెన్నుపోటుదారుడని పేర్కొన్న శశికళ అతడిని ఎలా ఎదుర్కోవాలో ‘అమ్మ’ దగ్గర నేర్చుకున్నానని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలబెడతానని, అసెంబ్లీలో అమ్మ చిత్రపటాన్ని ఆవిష్కరించి తీరుతానని పునరుద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala  Chief Minister  Panneerselvam  Supreme Court  DA Case  

Other Articles