తమిళ రాజకీయాలను కలవరపెడుతున్న మరో న్యూస్.. స్టాలిన్ ఏం చేస్తాడో? | Stalin Meet Panneerselvam over Madras HC interference.

Amid the intense battle for power stalin panneerselvam meet

Sasikala Strong, Panneerselvam vs Sasikala, Stalin, Stalin Meet Panneerselvam, Madras HC Panneerselvam, Sasikala PIL, Sasikala Governor, Sasikala Resorts Meet, Stalin Sasikala, Stalin OPS, DMK Support AIADMK

Advantage Stalin amid Panneerselvam vs Sasikala feud in AIADMK.

శశికళ బలపడితే ఇక అంతే...

Posted: 02/13/2017 05:15 PM IST
Amid the intense battle for power stalin panneerselvam meet

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ దూకుడు పెంచి మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పటికే అమ్మ సెంటిమెంట్ తో ఎమ్మెల్యేల వద్ద కన్నీటితో మద్ధతు కోరిన శ‌శిక‌ళ తాజాగా మ‌రోసారి గోల్డెన్ బే రిసార్టుకు బ‌య‌లుదేరింది. ఎవరు అడ్డుకున్నా తనను సీఎం కావటం ఆపలేరంటూ ప్రకటన కూడా చేసేసింది. ఇప్ప‌టికే ఆమె రెండు సార్లు అక్క‌డకు వెళ్లి త‌మ ఎమ్మెల్యేల‌తో మంత‌నాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. మరోవైపు హైకోర్టుకు పోలీసులు సమర్పించిన నివేదికలో ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నామంటూ చెప్పటంతో పన్నీర్ సెల్వం శిబిరంలో కలవరపాటు మొదలైంది. ఈ నేపథ్యంలో పోయెస్ గార్డెన్‌లోని త‌న నివాసంలో త‌మ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం ఆమె కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మ‌రో 24 గంటల్లో ప్ర‌భుత్వ ఏర్పాటు అనుమ‌తించాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు అన్నాడీఎంకే నేత‌లు తాము శాంతియుత నిర‌స‌న చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ అంశంపై చ‌ర్చించ‌డానికే శ‌శిక‌ళ గోల్డెన్ బే రిసార్టుకి బ‌య‌లుదేరిన‌ట్లు తెలుస్తోంది. మొద‌ట రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చించిన ఆమె ఇప్పుడు నేరుగా చ‌ర్చించేందుకే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నా... బల నిరూపణకు గవర్నర్ తమను ఆహ్వానించకపోవడం పట్ల శశికళ వర్గం గుర్రుగా ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖలు రాస్తున్నా... సమాధానం రాకపోవడంతో, వారిలో సహనం చచ్చిపోతోంది. దీని వెనుక బీజేపీ, డీఎంకేల కుట్ర దాగుందని శశికళ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను వెంటనే ఆహ్వానించేలా గవర్నర్ కు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ శశి వర్గీయులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 24 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో వారు కోరారు.

ఇక తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ భేటీ అయ్యాడు. ఈ మధ్యాహ్నం స్టాలిన్ సెక్రటేరియట్ కు వెళ్లి, అక్కడ కాసేపు గడిపి వచ్చారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం సచివాలయానికి చేరుకున్నారు. దీంతో, ఇద్దరూ కలిసే అవకాశం కుదరలేదు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం కలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే కొనసాగాలని స్టాలిన్ కోరుతున్నారు. శశికళ ముఖ్యమంత్రి అయితే ఆమె బలపడుతుందనే అనుమానాలు స్టాలిన్ కు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పన్నీర్ కు మద్దతు పలికేందుకు స్టాలిన్ సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో శశి వర్గం నుంచి కొంత మంది ఎమ్మెల్యేలనయినా పన్నీర్ లాగాల్సిన పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Sasikala  Panneerselvam  DMK Chief  Stalin  

Other Articles