పవిత్ర సంగం అమరావతిలో ఎన్పీడబ్ల్యూ సదస్సు ప్రారంభం.. | National Women Parliamentarians Conference at Amaravathi.

Nwp conference 2017 began at amaravathi

National Women’s Parliament, Empowering Women – Strengthening Democracy, Amaravati News, AP Capital Amaravati , National Women Parliamentarians Conference, National Women Parliamentarians, Kavitha Amaravathi, Kavitha at National Women Parliamentarians Conference, Dalai Lama Amaravathi, CBN speech at NWP Conference, Venkaiah Naidu speech at NWP Conference, National Women Parliamentarians Conference 2017

The three-day National Women’s Parliament, being organised by Andhra Pradesh Legislative Assembly with the theme of ‘Empowering Women – Strengthening Democracy’, began on Friday in the state capital region Amaravati. Buddhist spiritual leader Dalai Lama, Union Ministers M Venkaiah Naidu and P Ashok Gajapati Raju, AP Chief Minister N Chandrababu Naidu, Puducherry Lieutenant Governor Kiran Bedi, Bangladesh Parliament Speaker Shirin Chaudhury, Gandhian Ela Bhatt, actress Manisha Koirala and many other dignitaries attended the inaugural event at Pavitra Sangamam.

ITEMVIDEOS: మహిళా పార్లమెంటేరియన్ సదస్సు ప్రారంభం

Posted: 02/10/2017 12:42 PM IST
Nwp conference 2017 began at amaravathi

మహిళా సాధికారత-ప్రజాస్వామ్యానికి బలం పేరిట మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆడంబరంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బౌద్ధ గురువు దలైలామా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పాండిచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ, ఏపీ సీఎం చంద్రబాబు, మనీషా కోయిరాల, పలువురు దేశవిదేశాల నుంచి వచ్చిన 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఐదు ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. వంద మహిళా కళాశాలలకు ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయటం విశేషం.

ముందుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రసంగ ఉపన్యాసం చేస్తూ... మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువని, అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో మహిళలు ముందున్నారని తెలిపాడు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ... మహిళలను గౌరవించినప్పుడే ఏ సమాజమైనా ప్రగతిపథంలో పయనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులను కల్పించేందుకు తమ నాయకుడు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, చట్టం వచ్చేలా చేశారని తెలిపాడు. మహిళల విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించింది ఎన్టీఆరే అని, స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశాలు కల్పించింది కూడా ఆ మహానుభావుడేనంటూ కొనియాడాడు.

 

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని కోరిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశమేనని, మహిళా రిజర్వేషన్లను సాధించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ ప్రసంగించాడు. ఒక్క సాధికారతే కాకుండా, ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలు అడుగు వేయాలంటూ పిలుపునిచ్ాచడు. పనిలోపనిగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ప్రధానిగా ఆమె పోషించిన పాత్ర అసామాన్యమైనదని కొనియాడాడు. ఇక ఈ సదస్సు అమరావతిలో జరగడం చాలా ఆనందంగా ఉందని... దీనికి స్పీకర్ కోడెలను ప్రత్యేకంగా అభినందిస్తున్నన్నాడు. అనంతరం దలైలామా, వెంకయ్య నాయుడులు కూడా ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏపీ ప్రత్యేక హోదాకు మద్ధతు ప్రకటించటమే కాదు, సమావేశంలో సందడి చేస్తూ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది కూడా.

91 మంది మహిళా ఎంపీలు, 401 మంది లెజిస్లేటర్ లు, 300 మంది ఉద్యమ వేత్తలు దీనికి హాజరు అయ్యారు. కాగా, మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా మహిళలకు అధికారం అన్న అంశంతోపాటు, అన్ని రంగాల్లో మహిళలు ఎలా రాటుదేలాలన్న దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National Women Parliamentarians Conference  2017  Amaravathi  Dalai Lama  

Other Articles