సింగం మళ్లీ వాయిదా? ఇంకా థియటర్లలో బొమ్మ పడలేదంట | Singam 3 telugu version postponed.

Singam 3 telugu version not released

Suriya Singham 3, Yamudu 3 Release, Yamudu-3 Postponed, Singham 3 Telugu Version, Singam Postponed Last Minute, Singham 3

Suriya Singham 3 Telugu Version Not Released.

సింగం-3 మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందా?

Posted: 02/09/2017 09:55 AM IST
Singam 3 telugu version not released

హీరో సూర్య ప్రతిష్ఠాత్మకంగా తీసిన సింగం-3 కి రిలీజ్ కష్టాలు తప్పటం లేదు. నోట్ల రద్దు, ధృవ రిలీజ్, చెన్నై వరదలు, జల్లికట్టు ఇలా ప్రతీసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడ్డ చిత్రం ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా నేడు అంటే ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే మాతృక తమిళంలో యథావిథిగా విడుదల అయినప్పటికీ, తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మార్నింగ్ షో రిలీజ్ కాలేదు. అయితే మధ్యాహ్నానికి సినిమా విడుదల అవుతుందని సినిమాకు సంబంధించినవాళ్లు, థియేటర్ల యజమానులు చెబుతున్నారు. యముడు-3 పేరుతో తెలుగులో రావాల్సిన ఈ సినిమా విడుదలపై తమిళనాడు లో నెలకొన్న రాజకీయ ప్రభావం చూపుతాయని అంతా అనుకున్నారు. అయితే ఎలాగైనా సరే రిలీజ్ అయి తీరుతుందని కరాఖండిగా చెప్పిన సూర్య తమిళ్ లో మాత్రం రిలీజ్ చేసేశాడు. తెలుగులో ఎందుకు రాలేదన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

హరి దర్శకత్వంలో సింగం ఫ్రాంఛైజీలో మూడో పార్ట్ గా వస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన శ్రుతిహాసన్ నటించిన ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. మధ్యాహ్నానానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singham 3  Telugu Version  Yamudu 3  Release  postponed  

Other Articles