అర్థాంగి జుట్టు పట్టుకుని.. అలా గాలిలో అరగంట.. Man saves wife from suicide fall by grabbing ponytail

Husband saves wife from killing herself by grabbing ponytail

Husband, wife, ponytail, seven storey building, suicide attempt, shaanxi police, China, Shaanxi Province, Suicide Attempt, Catch, Haul, Rescue, Hair, Miraculous, Police, Rescuers, viral video

A woman from the Shaanxi province of China was hauled back to safety by her ponytail after jumping from a roof in a failed suicide attempt.

ITEMVIDEOS: అర్థాంగి జుట్టు పట్టుకుని.. అలా గాలిలో అరగంట..

Posted: 02/08/2017 12:06 PM IST
Husband saves wife from killing herself by grabbing ponytail

భార్యభర్తల మధ్య తగవులు, వాదనలు సాధారనం. అది అమెరికా అయినా.. చైనా అయినా లేక మనదేశంలోనైనా భార్యభర్తల దాంపత్య జీవితంలో గిల్లికజ్జాలు.. కోపతాపాలు. సముదాయింపులు అన్నీ వుంటాయి. ఇలా అద్దె ఇంట్లో కీచులాడుకున్న భార్యభర్తలు నువ్వంటే నువ్వంటూ ఏదో అంశంపై వాగ్వాదానికి దిగారు. తనది పైచేయి కాకపోవడంతో ఆ భార్యమణి ఏకంగా తాము నివసిస్తున్న ఏడో అంతుస్థ నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసింది.. అయితే అది గమనించిన భర్త అమెను జట్టు పట్టుకుని రక్షించాడు. ఇప్పడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను నిశితంగా పరిశీలించిన ఎవరికైనా ఓ క్షణం గుండె ఆగిపోవాల్సిందే. ఎందుకంటే తన భార్యను భర్త ఎలా ఆత్మహత్య యత్నం నుంచి కాపాడాడో చూస్తే.. కళ్లకు మైకం కమ్మెస్తుంది. వీడియోను చూస్తూనే ఉత్కంఠకు గురైనవాల్లు అనేక మంది వున్నారు. అయితే భార్యను కాపాడుకోవడం కోసం భర్త చేసిన అద్భుత సాహసాన్ని కూడా సోషల్ మీడియాలో జనులు కొనియాడుతున్నారు. చూస్తున్న వారిని, రక్షించేందుకు అక్కడి వచ్చిన పోలీసులను తీవ్రంగా కంగారుపెట్టిన ఈ ఘటన చైనాలోని షాంగ్జీలో చోటుచేసుకుంది.

భార్యభర్తలైన కాంగ్‌, లీయూ షాంగ్జీలోని ఓ ఏడంతస్తుల భవనంలోని చివరి ఫ్లోర్‌లో అద్దెకు నివాసం ఉంటున్నారు. కుటుంబం విషయంలో భార్యభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కాంగ్‌ కోపంతో ఆత్మహత్య చేసుకునేందుకు పరుగెత్తింది. ఆమె వెంటే భర్త కూడా పరుగెత్తాడు. ఒక్కసారిగా ఆమె ఏడంతస్తుల మీద నుంచి దూకగా అనూహ్యంగా భర్త చేతికి ఆమె జుట్టు అందడంతో దాన్ని పట్టుకున్నాడు. కాంగ్‌ మాత్రం తనను వదిలేయమని.. తనను చావనివ్వు.. అంటూ కేకలు పెడుతూనే గాల్లో వేలాడింది. కానీ భర్త మాత్రం పట్టువిడవకుండా అలాగే పట్టుకొని భార్యను పైగిలాగి ప్రయత్నం చేశాడు.

వీరిద్దరి సుమారుగా అరగంట పాటు అలా గాలిలో వుండగా, ఇక భర్త చేతిలో భార్య కాంగ్ జుట్టు కూడా చివరాఖరుకు చేరుకుంది. ఈలోగా పోలీసులు కూడా వచ్చి సహాయం చేసి కాంగ్‌ కిందపడకుండా రక్షించారు. ఘటన అనంతరం పోలీసులు మాట్లాడుతూ మరికొన్ని సెకన్లు తాము అలస్యమై వుండివుంటే అమెను రక్షించడం కష్టమయ్యేదని చెప్పుకోచ్చాడు. ఓ పోలీసు భుజానికి గాయాలు కూడా అయ్యాయి. అయితే, కేవలం ఆమె జుట్టును పట్టుకోవడం వల్లే అతడు కాపాడలేదని, అక్కడ ఒక మురుగు నీరు పారే పైపు ఉండటంతో ఆమె ప్రాణాలు రక్షించడం సులువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Husband  wife  ponytail  seven storey building  suicide attempt  police  viral video  Shaanxi Province  China  

Other Articles