నేతాజీపై సంచలన వ్యాఖ్యలు.. టైం దగ్గర పడింది... | Mulayam Singh Yadav Days are Counted.

Bjp leader comments on mulayam singh yadav

Sanjeev Balyan, Mulayam Singh Yadav, Mulayam Congress Alliance, Mulayam BJP, Mulayam Singh Yadav Comments, Mulayam Anti Congress Campaign, Mulayam Singh Yadav Akilesh Yadav, Akilesh Congress, SP Congress Alliance,

Senior BJP leader and Member of Parliament Sanjeev Balyan on Sunday said that Mulayam Singh Yadav's days are now numbered. Besides Mulayam says this Will not campaign for SP-Congress alliance.

ములాయంకి రోజులు దగ్గర పడ్డాయంట!

Posted: 01/30/2017 10:11 AM IST
Bjp leader comments on mulayam singh yadav

తన అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కుమారుడు అఖిలేష్ యాదవ్ వ్యవహారంతో సతమతమవుతున్న ములాయం సింగ్ కి ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సందు చిక్కినప్పుడుల్లా విరుచుకుపడుతున్న ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఏకంగా పరుష పదజాలానికే దిగారు. బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యన్ ఓ అడుగు ముందుకేసి ములాయం పై వ్యాఖ్యలు చేశాడు.

ములాయంకు మతపరమైన రాజకీయాలంటే పిచ్చి, ఇక ఆయన ఆటలు సాగవు. ములాయంకి రోజులు దగ్గరపడ్డాయంటూ ఘాటుగానే కామెంట్ చేశాడు. మధురలోని ఓ ర్యాలీలో పాల్గొన్న బాల్యన్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత అఖిలేశ్ యూపీ రాజకీయాల్లో కనిపించకుండా పోతాడంటూ తెలిపాడు. ఒకరు కేంద్రంలో దొపిడీ చేసిశారు, మరోవైపు అధికారం అండతో తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దొచుకున్నారు. మరోసారి వాళ్లిద్దరికీ పవర్ చేతికొస్తే(ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై) ఉన్నదంతా ఊడ్చుకుని పోతారంటూ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ తో పొత్తుపై ములాయం కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు. ఈ పొత్తు అనైతికమని, దాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని స్పష్టం చేస్తూ, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని తెలిపారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉండి కూడా పొత్తులు ఎందుకని ఆయన ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం కేంద్రం అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ - సమాజ్ వాదీ కూటమికి వ్యతిరేకంగా పనిచేయాలని కార్యకర్తలను కోరనున్నట్టు పేర్కొన్నారు. పార్టీ నేతలను అఖిలేష్ దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాజీ మంత్రి నారద్ రాయ్ బీఎస్పీలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేతలను దూరం చేసుకుంటే ఓటమే మిగులుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Mulayam Singh Yadav  Congress  Akilesh Yadav  

Other Articles