ప్రత్యేక పోరులో పాల్గోన్నారో..! విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరికలు SM Krishna Quits Congress, Says Party 'Doesn't Need Me'

With pain and anguish i have decided to quit congress says sm krishna

SM Krishna, Karnataka Chief Minister, SM Krishna Quits, Congress, former union minister, ex foreign affairs ministers, Prime Minister Narendra Modi

Former External Affairs Minister and Karnataka Chief Minister SM Krishna took jibe at the Congress party for sidelining him.

కన్నడ రాజకీయాలను శాసించి.. ఒంటరిగా మిగిలి..

Posted: 01/29/2017 01:09 PM IST
With pain and anguish i have decided to quit congress says sm krishna

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కన్నడ రాజకీయాలలో చెరగని ముద్ర వేసి, ఒకనాటి కాలంలో రాజకీయాలను శాశించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పార్టీకి గుడ్‌ బై చెబుతూ పార్టీ అధిష్టానికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ వర్కింట్‌ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఒకప్పుడు చక్రం తిప్పిన తనను ఇప్పుడు పార్టీ పట్టించుకోవడం లేదని అందచేత అవేదన చెంది తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన తనలాంటి కార్యకర్తను వయసు కారణంగా దూరం పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ రోజుల్లో మాస్ నాయకులు అవసరం లేదని, మేనేజర్లు కావాలని ఎద్దేవా చేశారు. వయసు అనేది రాజకీయాలకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. బాధ, ఆందోళనతో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు హైకమాండ్ తో చెప్పానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన ధ్రువీకరించారు.

1962లో కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎస్‌.ఎం.కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1968 నుండి మండ్య జిల్లా నుండి పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1983 నుండి 1985వరకు అప్పటి ప్రధానమంత్రులైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల కేబినెట్‌లో మంత్రిగా పదవులు లభించాయి. 1996, 2006 సంవత్సరాల్లో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన ఆయన 1989 నుండి 1994 వరకు వీరప్పమొయిలీ నేతృత్వంలో డిప్యూటీ సీఎంగా, విధానసభ స్పీకర్‌గా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక సీఎంగా, 2004 నుంచి 2008 వరకు మహరాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. 2009 నుండి 2012ల మధ్య అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles