అల్లర్లకు కారణం పోలీసులేనా..? వైరల్ వీడియో ను పోస్ట్ చేసిన కమల్| Kamal post Cop Setting An Auto On Fire video.

Cop setting an auto on fire in jallikattu protests

Jallikattu Protests, Kamal Haasan, Cop Setting An Auto On Fire, Rajinikanth request, Subramanian Swamy ISI, Chennai Jallikattu Chaos, Jallikattu violent protests

Jallikattu Protests Kamal Haasan, Others Tweet Video Of Cop Setting An Auto On Fire. Rajinikanth request to protesters. BJP's Subramanian Swamy says agitation funded by ISI.

ITEMVIDEOS:చెన్నై అల్లర్లు, ఈ వీడియోకు సమాధానమేది?

Posted: 01/24/2017 08:36 AM IST
Cop setting an auto on fire in jallikattu protests

ఆరు రోజులపాటు ప్రశాంతంగా జరిగిన జల్లికట్టు నిరసన ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీటి వెనుక పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హస్తం ఉందంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. మొదట ఉద్యమాన్ని నడిపిన వారు ఇప్పుడు అందులో లేరని చెబుతున్న ఆయన, సంఘ విద్రోహశక్తులు చేరటంతోనే పరిస్థితి ఇలా మారిందంటూ అనుమానం వ్యక్తం చేశారు.

జల్లికట్టు కోసం తాను ముందు నుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్సే దానిని నిషేధించిందని ఆయన తెలిపారు. జల్లికట్టు పట్ల తాము ముందు నుంచి సానుభూతితో ఉన్నామని ఆయన చెప్పారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని ఉద్యమకారులంటున్నారని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

కాగా, బీచ్ లో ఉన్న నిరసనకారులను ఖాళీ చేయించే క్రమంలో చెలరేగిన అల్లర్లు ఒక్కసారిగా నగరం మొత్తం, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెట్రోల్ బాంబులతో ఆందోళనకారులు తమపై దాడి చేస్తుంటే తిరిగి ప్రతిఘటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రజనీ రిక్వెస్ట్...
చెన్నైలోని మెరీనా బీచ్ నుంచి ‘జల్లికట్టు’ ఉద్యమకారులను వెళ్లగొట్టేందుకు పోలీస్ చర్యలు చేపట్టడంతో పలు ప్రాంతాల్లో ఈ రోజు హింసాకాండ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గతరాత్రి కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ట్వీట్ చేశారు. ‘జల్లికట్టు’ ఉద్యమకారులు తమ నిరసనలు, ఆందోళనలు విరమించాలని రజనీకాంత్ పిలుపు నిచ్చారు. ఆ విధంగా చేయకపోతే,ఈ ఉద్యమాన్ని అసాంఘికశక్తులు తమ చేతుల్లోకి తీసుకుంటాయని, దీంతో, ఉద్యమకారులకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని తన లెటర్ ప్యాడ్ పై తమిళ్ భాషలో రాసి, దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

వైరల్ అవుతున్న వీడియో...

ఇదిలా ఉంటే కొన్ని ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ఓ వీడియో సంచలనంగా మారింది. ఆందోళనకు అసలు కారణం నిరసనకారులు కాదని, పోలీసులే అంటూ అందులో ఉంది. ఓ పోలీస్ అధికారి ఆటోకు నిప్పు పెడుతున్న వీడియో హల్ చల్ చేస్తోంది. కమల్ హసన్, అరవింద స్వామి తదితరులు ఈ వీడియోను తమ ట్విట్టర్ లలో పోస్ట్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఓ అధికారి తెలుపగా, మరో అధికారి మాత్రం అదంతా మార్ఫింగ్ అంటూ తేల్చేయటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Jallikattu  Chaos  violent  

Other Articles