జల్లికట్టుపై అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ట్వీట్ | Jallikattu row: Owaisi tweet on Uniform Civil Code.

Asaduddin owaisi controversial tweet on jallikattu

All India Majlis-e-Ittehad-ul Muslimeen, AIMIM, Asaduddin Owaisi, Jallikattu Tweet, Owaisi Jallikattu protests, Asaduddin Owaisi Uniform Civil Code, Uniform Civil Code Owaisi, Owaisi Jallikattu tweet, MIM MP Owaisi

All India Majlis-e-Ittehad-ul Muslimeen (AIMIM) leader Asaduddin Owaisi today said that the Jallikattu protests are a lesson for the Hindutva forces. "Lesson for Hindutva forces, Uniform Civil Code cannot be imposed this nation cannot have one culture we celebrate all," he said in a tweet.

జల్లికట్టు వంకతో ఒవైసీ వివాదాస్పద ట్వీట్

Posted: 01/20/2017 01:20 PM IST
Asaduddin owaisi controversial tweet on jallikattu

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జల్లికట్టుపై వివాదాస్పద ట్వీట్లు చేశాడు. హిందుత్వ శక్తులకు ఈ నిరసన ఓ పెద్ద గుణపాఠం లాంటిదని అంటున్నాడు. ఉమ్మడి పౌర స్మృతి ఒకేలా ఉండదని ఈ ఉదంతం నిరూపించిందని తెలిపాడు.

దేశమంతా ఒకే రకమైన సాంప్రదాయం ఉంటుందని, జాతి మొత్తం ఒకేలా వేడుకలు జరుపుకుంటుందని కొందరు వాదిస్తున్నారు, కానీ, అది కుదరదని నేను ముందు నుంచే చెబుతున్నాను. తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఉద్యమమే దీనికి నిదర్శనమని ఒవైసీ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) మంచింది కాదని గతంలో ఒవైసీ చాలాసార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ అంశంపై దేశం మొత్తం అట్టుడుకి పోతుంటే ఈ అంశాన్ని కూడా ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవటం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జల్లికట్టు ఘనతంతా తమకే చెందాలని తమిళనాడులో రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకేలు రంగంలోకి దిగాయి. తాజాగా తమిళనాడుకు చెందిన బీజేపీ నేత రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కేంద్ర మంత్రి దావేతో భేటీ అయ్యారు. నిషేధిత జంతువుల జాబితా నుంచి ఎద్దును తొలగించాలని వారు కోరారు. జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ ను తీసుకురావాలని విన్నవించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  Uniform Civil Code  Jallikattu Tweet  

Other Articles