రెండో రాజధానిగా ఆ కొండ ప్రాంతమా! ఓట్ల కోసమా? | Dharamshala is 2nd capital of Himachal Pradesh.

Dharamsala declared the second capital of himachal pradesh

Himachal Pradesh, Dharmasala, Chief Minister Virbhadra Singh, Virbhadra Singh Dharmasala, Himachal Pradesh Capital, Himachal Pradesh second capital, Himachal Pradesh news, Himachal Pradesh elections, Himachal Pradesh Dharamshala, Shimla Dharamshala

Himachal Pradesh Chief Minister Virbhadra Singh declared Dharamshala as the second capital of Himachal Pradesh. which is situated in the snow-capped majestic and mighty Dhauladhar range.

చారిత్రక ప్రాంతం... రెండో రాజధాని!

Posted: 01/20/2017 10:03 AM IST
Dharamsala declared the second capital of himachal pradesh

దేశంలో మరో రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటయ్యింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్. పర్వత ప్రాంతమైన ధర్మశాలను రాష్ట్ర రెండో రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే సిమ్లా మొదటి రాజధానిగా ఉన్న విషయం తెలిసిందే. 

ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని... రెండో రాజధాని కావడానికి ధర్మశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని దిగువ ప్రాంతాలైన చంబా, కాంగ్రా, హమీర్ పూర్, ఉనా జిల్లాలకు ధర్మశాల ముఖ్యమైన నగరం. పైగా పవిత్రమైన దలైలామా ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. గతంలో 2005లో ఓసారి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించారు.

అయితే అంత తక్కువ జనాభా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎలా ప్రకటిస్తారంటూ సీఎంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 25 ఈ జిల్లాలలోనే ఉన్నాయి. దీంతో, ఈ ప్రాంత వాసులను ఆకట్టుకోవడానికి రెండో రాజధాని ప్రకటనను ముఖ్యమంత్రి చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెండో రాజధాని అంటూ పాట పాడటంపై తీవ్ర విమర్శలు వెలువత్తే అవకాశం లేకపోలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Himachal Pradesh  Capitals  Shimla  Dharamshala  

Other Articles