ఇండియాకు న్యూఇయర్ టెర్రర్ వార్నింగ్.. హైదరాబాద్ లో ఏంటి పరిస్థితి? | Israelis warned of imminent terror threat in India.

Israel warned india over terrorist attacks

India, India 2017, new year celebrations, Israel issues travel warning, India New Year Celebrations, India Israel, Israel terror warning, India Beach terror warn, Israel India terror warning, Hyderabad New Year Celebrations 2017

Israel issues travel warning for India citing threat of attacks at tourist hotspots.

బీచ్ పార్టీల్లో ఉగ్రదాడులకు స్కెచ్!

Posted: 12/31/2016 09:54 AM IST
Israel warned india over terrorist attacks

ఓవైపు కొత్త ఏడాది సంబరాలకు అంతా ముస్తబు అవుతుంటే.. ఉగ్రదాడుల అలర్ట్ కలకలం రేపుతోంది. న్యూఇయర్ వేడుకల్లో టెర్రరిస్టులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. భారతదేశంపై ఏ క్షణమైనా ఉగ్రవాదులు భారీ ఎత్తున దాడులతో విరుచుకుపడవచ్చని, పశ్చిమ దేశాల నుంచి వెళుతున్న పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించింది.

కొత్త సంవత్సరం వేడుకలు, టూరిస్టులు లక్ష్యంగా ఈ దాడులు సాగవచ్చని, ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో దాడులు సాగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశామని ఇజ్రాయిల్ యాంటీ టెర్రరిజం డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. క్లబ్, బీచ్ పార్టీలకు ఇండియాలోని తమ దేశీయులు దూరంగా ఉండాలని, గోవా, పుణె, ముంబై, కొచ్చిన్ ప్రాంతాలు రిస్క్ లో ఉన్నాయని పేర్కొంది.

కాగా, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎంతో మంది సైనికులకు ఇండియన్ ఆర్మీ గత కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

రాత్రి 1 కాదు 2 గంటల దాకా...

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే వేడుకలకు హైదరాబాద్ పోలీసులు నిబంధనలు సడలించారు. అర్థరాత్రి ఒంటిగంట దాకా అనుమతించిన పోలీసులు, ఆపై దానిని 2 గంటల దాకా పొడిగించారు. ప్రతీయేడాది 1 గంటల దాకానే అనుమతి ఉండగా, ఈసారి వచ్చిన విజ్నప్తుల మేరకు గంట పొడిగించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతిగా ప్రవర్తిస్తే, జైలుకు వెళ్లాల్సి వుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. యథావిధిగా అన్ని ఫ్లయ్ ఓవర్లనూ మూసివేస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుందని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తుంటామని తెలిపారు. దాదాపు ఇదే విధమైన ఆంక్షలు విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ కొనసాగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Year Celebrations  India  Terror warning  beach parties  Israel  

Other Articles