చైనా కోసమే స్పెషల్ గా అగ్ని-5 | Agni-5 Missile Capable of Reaching China Test Fired.

India successfully test fires nuclear capable agni v

Defence Research and Development Organisation, DRDO, Agni-V, Agni Missile Family, Agni-V special features, Agni-V China, India Agni-V China, Agni-V DRDO, Agni-V Range and Target, Agni Missiles

Agni-V is an intercontinental ballistic missile developed by the Defence Research and Development Organisation (DRDO) of India successfully test fires.

అగ్ని-5 అసలు టార్గెట్ వేరే ఉందా?

Posted: 12/26/2016 01:14 PM IST
India successfully test fires nuclear capable agni v

భారత అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన క్షిపణ చేరిపోనుంది. ఖండాంతర క్షిపణి అగ్ని-5ను నేడు విజయవంతంగా పరీక్షించారు డీఆర్డీవో శాస్త్రవేత్తలు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. భారత్ దీనిని శాంతి ఆయుధంగా పేర్కొనటం విశేషం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ ఆర్గజైజేషన్(డీఆర్డీవో) నాలుగు పరీక్షల తర్వాత పూర్తిస్థాయిలో పరీక్షించింది. ప్రధానంగా గైడెడ్, నావిగేషన్ వ్యవస్థలను నేటి పరీక్షలో విజయవంతంగా చేయగలిగారు. మరికొన్ని పరీక్షల అనంతరం భారత సైన్యం అమ్ములపొదిలోకి ఈ క్షిపణులు చేరుతాయి. అగ్ని-1 700 కిలోమీటర్లు, అగ్ని-2 2000 కిలోమీట్లరు, అగ్ని-3 మరియు అగ్ని-4 2500 నుంచి 3500 కిలోమీటర్ల లక్ష్యాలను నాశనం చేయగలవు. ఇక అగ్ని-5 ముఖ్య ఉద్దేశం ఏదైనప్పటికీ, ఇది వరకు ఇంత సుదూర క్షిపణిని తయారు చేసి పరీక్షించిన చైనా ఆటలకు చెక్ పెట్టేందుకే అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

అగ్ని-5 క్షిపణి ప్రత్యేకతలు ఇవే...

1. భారత్ 35 దేశాల మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ లో సభ్యత్వం పొందిన తర్వాత అగ్ని-5కు నిర్వహించిన తొలి పరీక్ష ఇది.

2. ఐదు వేల కిలోమీటర్లు, 1000 కేజీల వార్ హెడ్ ను ఈ మిసైల్ మోసుకుపోగలదు.

3. పాకిస్థాన్, చైనా, యూరోప్ లోని పలు ప్రాంతాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థకు చెందినది.

4. ఉపరితలం నుంచి ఉపరితలానికి దీన్ని ప్రయోగించగలం. అత్యాధునిక ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఉండటంతో... శత్రు వ్యవస్థలు దీని ఆగమనాన్ని పసిగట్టడం చాలా కష్టం.

5. అగ్ని-6 క్షిపణి ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉంది. దీని రేంజ్ 8వేల నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. సబ్ మెరైన్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించేలా సిద్ధం చేస్తున్నారు.

6. 17 మీటర్ల పొడవుంటే ఈ మిస్సైల్ 50 టన్నుల అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు.

ఇదిలా ఉంటే త్వరలో అగ్ని-6 తో 8000 నుంచి 10000 కిలో మీటర్ల లక్ష్యాలను నాశనం చేయగల క్షిపణిని రూపొందించేందుకు రక్షణ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agni-V  DRDO  Test Fire  China  

Other Articles