శ్వేతసౌధం నుంచి బారాక్ ఒబామా ‘‘ది లాస్ట్ మెసేజ్’’ Barack and Michelle Obama give final Christmas message

Barack and michelle obama give final christmas message

US PRESIDENT, Barack Obama, first lady Michelle Obama, eight years in office, Americans, “Merry Christmas”, White House.

US PRESIDENT Barack Obama and first lady Michelle Obama have reflected on eight years in office as they wished Americans a final “Merry Christmas” from the White House.

శ్వేతసౌధం నుంచి బారాక్ ఒబామా ‘‘ది లాస్ట్ మెసేజ్’’

Posted: 12/25/2016 09:51 AM IST
Barack and michelle obama give final christmas message

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి, ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామాలు తమ చివరి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అగ్రరాజ్య అధ్యక్ష హోదాలో శ్వేతసౌధం నుంచి అమెరికాలోని క్రైస్తవులను నుద్దేశించి.. తమ చివరి సందేశాన్నిచ్చారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో భిన్న కోణాల్లో విడిపోయిన అమెరికా ప్రజలంతా ఐక్యతా భావంతో మెలగాలని ఒబామా ఆకాంక్షించారు. క్రిస్మస్‌ వేడుకలను అమెరికా ప్రజలంతా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా సైన్యం అందిస్తున్న సేవలకు గాను ఒబామా తన మెసేజ్‌లో ధన్యవాదాలు తెలిపారు.

అమెరికన్లలో విలువలు ఎంతో గొప్పవని, ఆ విలువలే దేశ ప్రజలను ఐకమత్యంలో నిలుపుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సహోదర భావంతో మెలగాలని, క్రిస్మస్‌ ను ఉల్లాసంగా జరుపుకోవాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టిన నాటితో పోలిస్తే, ఇప్పుడు అమెరికా మరింత బలోపేతమైందని, ప్రపంచంలోని అన్ని దేశాలూ గౌరవిస్తున్న దేశంగా నిలిచిందని తెలిపారు. నిరుద్యోగాన్ని తొమ్మిదేళ్ల కనిష్ఠస్థాయికి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. అలాగే.. గత ఎనిమిదేళ్లుగా అమెరికా ప్రజలకు సేవ చేయడం అనేది.. మిచెల్లీ, తాను పొందిన గొప్ప గిఫ్ట్‌ అని ఒబామా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles