శశికళకు అసలు అంత సీన్ ఉందా? | Sacked AIADMK MP Sasikala Pushpa will contest for the party's

Sasikala pushpa denies expulsion from party

Sasikala Pushpa, Sasikala Natarajan, Sasikala versus Sasikala, Sasikala Pushpa Madras High court, Sasikala Natarajan Chinamma, Sasikala Natarajan Madras HC, AIADMK general secretary, AIADMK Sacked MP, Sasikala Pushpa AIADMK, AIADMK Madras Hidh Court, AIADMK new general secretary

Sacked AIADMK MP Sasikala Pushpa threatens to contest for the party’s general secretary post.

శశికళ పార్టీని అంతలా భయపెడుతోందా?

Posted: 12/23/2016 09:15 AM IST
Sasikala pushpa denies expulsion from party

ఇక్కడ మనం చెప్పుకోబోయేది అమ్మ జయలలిత చనిపోయాక పార్టీని, పవర్ ని గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్న శశికళ నటరాజన్ గురించి కాదులేండి. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన ఎంపీ శశికళ పుష్ప గురించి...

పురుచ్ఛితలైవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శశికళ నటరాజన్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయబోతున్నట్లు ఓ ప్రకటన చేసింది. అంతేకాదు అన్నాడీఎంకే నుంచి తనను ఎవరూ బహిష్కరించలేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తాను ఏఐఏడీఎంకే ఎంపీగా కొనసాగుతున్నానని.. పార్టీలో కనీసం సభ్యులుగా లేని వారు కూడా తనపై పెత్తనం చెలాయించే దమ్ము ఎవరికీ లేదంటూ పరోక్షంగా చిన్నమ్మకు చురకలు అంటించింది.

ఇంతకు ముందు జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్‌ ప్రయత్నించారని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేసింది కూడా. కాగా, పార్టీ పగ్గాలు చేపట్టాలని అంతా శశికళను కోరుతున్నారన్న వార్తల నడుమ, తాను కూడా పోటీలో ఉన్నానని శశికళ పుష్ప ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.

అయితే 75 శాతం మంది కార్యకర్తలు పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మరోపక్క శశికళ పుష్ప పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ మద్రాసు హైకోర్టును అన్నాడీఎంకే  ఆశ్రయించిన నేపథ్యంలో నేడు వెలువడే తీర్పు కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK general secretary  Sasikala Pushpa  Sasikala Natarajan  

Other Articles