బాబూ పక్కనే ఉండగా దేవినేనిని అవమానించారు | Chandrababu commandos stopped Devineni Uma.

Devineni stopped by chandrababu commandos

Chandrababu Naidu Commandos, Chandrababu Naidu Security, Chandrababu Naidu Security Devineni Uma, Devineni Uma Chandrababu Naidu, Devineni Babu security, Babu Security Devineni Uma

Andhra Pradesh Irrigation Minister Devineni Uma stopped by Chandrababu Naidu Commandos.

బాబు సమక్షంలోనే మంత్రికి అవమానం

Posted: 12/21/2016 08:58 AM IST
Devineni stopped by chandrababu commandos

భద్రతా సిబ్బంది అవగాహనా లోపంతో ఏపీ మంత్రి దేవినేనికి అనుకోని పరిస్థితి. స్వయానా తాను మంత్రిని అని అరిచి చెప్పుకుంటే తప్ప వదలని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. అది కూడా చంద్రబాబు సమక్షంలోనే కావటం విశేషం. మంగళవారం విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌కు హాజరైన మంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

పక్కనే నిలుచున్న సీఎంతో మాట్లాడేందుకు వెళ్తున్న మంత్రి దేవినేని ఉమను కమాండోలు అడ్డుకున్నారు. బాబును కలవటానికి వీల్లేదంటూ బంధించేశారు. దీంతో మంత్రి కొంత అసంతృప్తికి లోనయ్యారు. తాను మంత్రినయ్యా బాబూ అంటూ అసహనం వ్యక్తం చేయటంతో అప్పుడు సారీ అంటూ వదిలిపెట్టారు.

ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత సీఎంకు భద్రత పెంచిన సంగతి తెలిసిందే. ఈ సెక్యూరిటీ సిబ్బంది తరచూ మారుతుంటారు. పైగా వాళ్లకి భాష కూడా అర్థం కాదు. మంత్రులెవరో, ఎమ్మెల్యేలు ఎవరో వారు గుర్తుపట్ట లేకపోతున్నారు. ఈ కారణంగా మంత్రి అయిన దేవినేనిని అడ్డుకున్నారు. అయితే తాను మంత్రిని అని చెప్పడంతో అప్పుడు పొరపాటును గుర్తించిన కమాండోలు స్వయంగా మంత్రిని సీఎం వద్దకు తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Minister Devineni Uma  Chandrababu Naidu security  

Other Articles