మీడియా అంటేనే ట్రంప్ వణికిపోతున్నాడా?| Trump escapes from media.

Trump should skip beltway media

Donald Trump, Trump Media, Trump escaped from media, Trump fear for Media, Media against Donald Tump, Trump media fever

Donald Trump cancelled all his press meets until January.

మీడియా పేరు వింటే గజ గజ వణికిపోతున్నాడు

Posted: 12/14/2016 08:01 AM IST
Trump should skip beltway media

డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఈయనగారు గెలిచింది ఒక్క హిల్లరీ క్లింటన్ మీదే కాదు.. తన ఓటమిని ఖారారు చేస్తూ కథనాలు ప్రచురించిన మీడియా మీద కూడా. అమెరికా ప్రజలు తనకు ఎలాంటి మద్ధతు ఇస్తున్నారో ఓటింగ్ శాతం ద్వారా తేటతెల్లం చేసేశాడు ట్రంప్. ఇక ప్రస్తుతం మీడియా అంటే భయపడుతూ, ఇకపై దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంట.

అయితే అది కొంత కాలమే సుమీ. వచ్చే జనవరి వరకు మీడియా ముందుకు రాకూడదని నిర్ణయించుకున్నారు. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టాల్సిన నేపథ్యంలో క్రిస్మస్ కు ముందే దేశ ప్రజలకు తన పాలనా పద్ధతులు, వివాదాస్పద అంశాల్లో తన వైఖరి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను సిద్ధం చేసిన నూతన విధానాలు, ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు నెరవేర్చేందుకు తీసుకోనున్న చర్యలను వివరించాల్సి ఉంది. అయితే శ్వేత సౌధం నుంచి అధికార బదిలీ వ్యవహారాలు చూస్తున్న ట్రంప్ ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించి, దేశ ప్రజలకు సందేశం ఇవ్వాలని భావించడం లేదని ట్రంప్ అధికారప్రతినిధి హోప్ హిక్స్ తెలిపారు.

ప్రస్తుతం మీడియాలో వ్యతిరేక వార్తలు ఇంకా ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం మరింత అగ్గి రాజేసే ప్రమాదం ఉందనే వెనకడగు వేస్తున్నాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, సీఎన్ఎన్, ఏబీసీ లాంటి టాప్ వార్తా సంస్థలు కూడా ప్రచార సమయంలో క్లింటన్ కు మద్ధతుగానే ప్రచారం చేశాయి. దీంతో రానున్న రోజుల్లో మీడియా మీద గ్రేట్ రివెంజ్ తీర్చుకునే అవకాశాలు లేకపోలేవని కొందరు అంటుంటే.. అలాంటి రిస్క్ ట్రంప్ చేయబోడని ఇంకోందరు అంటున్నారు.

రీ కౌంటిగ్ లోనూ గెలుపు...
కాగా, అవకతవకలు జరిగాయంటూ గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌కు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రీకౌంటింగ్ డిమాండ్ తెరపైకి రాగా, ఎలక్షన్ కమిషన్ అందుకు అంగీకరించడం తెలిసిందే. ఆ తంతు కూడా ముగియటం, పెద్ద మార్పులేమీ చోటు చేసుకోకుండానే ట్రంప్‌ మళ్లీ గెలవటం జరిగిపోయాయి. రీకౌంటింగ్‌ అనంతరం తుది ఫలితాల్లో 0.06 శాతం మార్పులు చోటుచేసుకున్నాయి. విస్కాన్సిన్, పెన్సిల్వేనియాల్లో ట్రంప్‌ గెలిచినట్లు అధికారులు ధ్రువీకరించారు.

విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్‌ రాష్ట్రాల్లో జిల్‌ స్టీన్‌కు కేవలం 1% ఓట్లు రావడంతో లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీ కౌంటింగ్‌ జరపాలని ఆమె కోరారు. విస్కాన్సిన్‌లో రీకౌంటింగ్‌ జరపగా మళ్లీ ట్రంప్‌ గెలిచారు. పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో పునఃలెక్కింపు అవసరం లేదని కోర్టులు తీర్పునిచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America New President  Donald Trump Media Fever  

Other Articles