భారీ భూకంపం మాత్రమే... సునామీ భయం లేదు | Earthquake hits northern Sumatra, Indonesia

Quake of magnitude 6 4 hits near indonesian town

Earthquake Strikes, Indonesia earthquake, Sumatra earthquake, Aceh province, 6.4-magnitude earthquake, Indonesia Tsunami warn, Indonesia 2016 Tsunami, Indonesia Tsunami Warn

6.4-magnitude earthquake strikes Aceh province in Sumatra.

భారీ భూకంపం.. 25 మంది మృతి

Posted: 12/07/2016 08:01 AM IST
Quake of magnitude 6 4 hits near indonesian town

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలూ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దేశాలకు వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లో ప్రకృతి విపత్తులు తీవ్ర విషాదాలను మిగిల్చాయి కాబట్టి. 2004 లో ఇండోనేషియాతోపాటు పలు ఆసియా దేశాలకు అప్పుడే పరిచయం అయిన సునామీ లక్షల మంది ప్రాణాలను బలిగొంది. మొత్తం లక్షా 70 మంది చనిపోయినట్లు ఓ అంచనా. ఇక భారత్ లో అయితే 8 వేల మంది చనిపోయారు.

ఇక ఆ దెబ్బకి తీవ్రంగా నష్టపోయిన ఇండోనేషియాలో బుధవారం వేకువఝామున భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్ర రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్తర సుమత్రాలోని బండా అసెకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అమెరికా జియాలాజికల్ సర్వే పేర్కొంది. వేల సంఖ్యలో బిల్డింగ్ లు కుప్పకూలిపోగా, 25 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద లెక్కలేనంత మంది ఇరుక్కుని ఉంటారని సమాచారం.

Indonesia Earth Quake

Sumatra Earth Quake

Indonesia Sumatra Quake

భూమికి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా 2004లో ఇదే ప్రాంతంలో సంభవించిన సునామీ తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ యేడాది జూన్ లోనూ సుమత్రతా ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూమి కంపించి విపరీతమైన ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, ఎవరూ చనిపోకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indonesia  Earthquake Strikes  Aceh province  No Tsunami  

Other Articles