తెలంగాణలో ఇక నో ఎంసెట్! | Eamcet Entrance Scrap in Telangana soon.

Telangana to scrap eamcet for engg

EAMCET Exam, Telangana government, No EAMCET in telangana, Telangana EAMCET, Kadiyam Srihari EAMCEt

Telangana Government proposal to scarp EAMCET entrance.

ఎంసెట్ ను పూర్తిగా రద్దు చేయబోతున్నారా?

Posted: 12/01/2016 09:25 AM IST
Telangana to scrap eamcet for engg

ఇకపై ఇంజనీరింగ్ సీట్లను ఎంసెట్ లేకుండానే భర్తీ చేయనున్నారా? ఇప్పటికే మెడికల్ ఎంట్రన్స్ నీట్ రూపంలోకి మారిపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లో ఎంసెట్ ఒక చ‌రిత్ర‌గా మిగిలిపోబోతుంది. బుధవారం సర్వశిక్షాభియనయన్ ఆఫీస్ లో డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి, కడియం శ్రీహరి ఈమేరకు సూచన కూడా ఇచ్చేశారు. ఎంసెట్ ర‌ద్దు అంశాన్ని ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోందంటూ పరోక్షంగా ఆయన వ్యాఖ్యనించాడు.

సాధారణంగా ఇంజినీరింగ్ విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశాల కోసం విద్యార్థులు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే ఎంసెట్‌తోపాటు జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లు రాస్తున్నారు. జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ల‌లో సీట్లు రాక‌పోతే విద్యార్థులు ఎంసెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా మూడు ప‌రీక్ష‌లు రాయ‌డం వల్ల విద్యార్థుల‌కు ఆర్థిక‌భారంతోపాటు మాన‌సికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌బుత్వం భావిస్తోంది. అందుకే ఏకంగా ఎంసెట్‌ను ఎత్తివేసి సీబీఎస్ఈ నిర్వ‌హించే మెయిన్ ప‌రీక్షలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఇంజినీరింగ్ క‌ళాశాలల్లో ప్ర‌వేశాలు క‌ల్పించాల‌ని యోచిస్తోంది.

వ‌చ్చే ఏడాది నుంచి మెడిక‌ల్ కాలేజీల్లో సీట్ల కోసం జాతీయ స్థాయిలో కేంద్రం నీట్‌ను నిర్వ‌హించ‌బోతోంది. ఇందులో ర్యాంకుల ఆధారంగానే మెడిక‌ల్ సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే జేఈఈ పరీక్ష‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుని క‌ళాశాల‌ల్లో సీట్లు కేటాయించ‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని, చాలా రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నార‌ని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్టుగా ఎంసెట్‌ను ర‌ద్దు చేస్తే మాత్రం ఇంట‌ర్ వెయిటేజీ ఉండ‌క‌పోవ‌చ్చు.

అదే సమయంలో ఇంట‌ర్ మార్కుల ఆధారంగానే సీట్లు భ‌ర్తీ చేస్తే ఎలా ఉంటుంద‌న్న అంశాన్ని కూడా విద్యాశాఖ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ పధ్ధతి స‌రికాద‌న్న వాదన వినిపిస్తున్నారు కొందరు విద్యావేత్తలు. ఒక‌వేళ ప్ర‌భుత్వం జేఈఈ మెయిన్ ర్యాంకుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే విద్యార్థులు ఇంట‌ర్‌లో పాస్ మార్కుల‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఎంసెట్ రద్దు ప్రపోజల్ ఇప్పటిదేం కాదు. పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అప్పట్లో జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్స్ లర్ గా ఉన్న దయారత్నం నేతృత్వంలో ఓ కమిటీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : EAMCET  telangana govt  scrap  

Other Articles