కాళ్లు నరికిన టెక్కీ నిఖిల్.. నడుస్తున్నాడు | Nikhil Reddy walking without the help of a walker.

Nikhil reddy walking without aid

Nikhil Reddy height, Nikhil Reddy aid, Nikhil Reddy walker video, Nikhil Reddy operation, Nikhil Reddy surgery, techie Nikhil Reddy , Nikhil Reddy walking npw, Global hospital Nikhil Reddy, Nikhil reddy parents

Nikhil Reddy, who underwent a surgery to increase his height, walking without the help of a walker has gone viral.

కాళ్లు నరికినా ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు

Posted: 11/30/2016 08:25 AM IST
Nikhil reddy walking without aid

సినిమాల ప్రభావంతో తాను తన ఫేవరెట్ హీరోలా ఉండాలన్న కోరికతో బెడ్ కే పరిమితమైన నిఖిల్ రెడ్డి గుర్తున్నాడా? హైట్ పెరగడానికి మూర్ఖంగా కాళ్ల నరికించుకుని ఆపరేషన్ చేయించుకుని ఆపై చిక్కులు ఎదుర్కున్నాడు.

ఆపై ఆస్పత్రి వ్యవహారంపై విమర్శలు చెలరేగటం, తెలంగాణ సర్కార్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవటంతో దిద్దు బాటు చర్యలకు దిగింది. దీంతో నిఖిల్ రెడ్డి క్రమంగా కోలుకుంటున్నాడు.గ్లోబల్ దవాఖాన డాక్టర్లతో పాటు.. ఇతర వైద్యులు అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. దీంతో నిఖిల్‌రెడ్డికి దాదాపుగా నయమైంది. మంగళవారం నిఖిల్‌రెడ్డి ఎవరి అండా లేకుండా సొంతంగా తానే వాకర్ సహాయంతో నడిచాడు. తమ కుమారుడు నడుస్తుండడం సంతోషంగా ఉందని నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Nikhilreddy walk

కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్రలోని ఎంఎన్‌రెడ్డినగర్‌కు చెందిన గోవర్దన్ రెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి ఎత్తు పెరిగేందుకు ఈ యేడాది ఏప్రిల్ 5న కాళ్లకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. నెలలు గడుస్తున్నా అతనికి నయం కావడంలేదని, తమకు తెలియకుండా మాయ మాటలతో తమ కుమారుడికి చికిత్స చేశారని గోవర్దన్ రెడ్డి ఆరోపించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil Reddy  height  surgery  walking  

Other Articles