యువతిని సెక్స్ వర్కర్ గా మారకుండా కాపాడిన పాత నోట్లు | with old currency Girl life saved in Rajasthan.

Rajasthan girl saved from being sold into flesh trade

Rajasthan Girl, Demonetisation saves life, Alwar girl saves life, Demonetisation Flesh Trade, Rajasthan Girl escaped

Thanks To Demonetisation Rajasthan Girl Saved From Being Sold Into Flesh Trade By Her Own Family.

పాత నోట్లకి యువతి స్పెషల్ థాంక్స్

Posted: 11/24/2016 03:14 PM IST
Rajasthan girl saved from being sold into flesh trade

ప్రస్తుతం దేశ ప్రజలంతా పాత నోట్లను మార్చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. బ్లాక్ మనీ బయటపడుతుందని, నకిలీ కరెన్సీని నియంత్రించొచ్చన్న మోదీ ప్రభుత్వ ఆలోచన ఎంత వరకు వర్కవుట్ అవుతుందో లేదో చెప్పలేం గానీ, ఆ నిర్ణయం ఇక్కడ ఓ 21 ఏళ్ల యువతి జీవితం నాశనం కాకుండా మాత్రం కాపాడగలిగింది.

రాజస్థాన్ సవాయ్ మధోపూర్ జిల్లా జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్లితే... ఓ పంక్షన్ ఉందని చెప్పి సదరు యువతిని ఆమె సోదరుడు, కజిన్ ఇద్దరూ అల్వార్ కి తీసుకెళ్లారు. అక్కడ సెక్స్ వర్కర్లను సప్లయ్ చేసే ఓ ముఠాకు ఈ యువతిని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. సొంత అన్నే తనను అమ్మాలని చూడటం ఆ యువతికి షాక్ కలిగించింది. కానీ, ఒంటరిది కావటంతో ఏం చేయలేకపోయింది. కాస్తలో ఆ అమ్మాయి సెక్స్ వర్కర్ గా మారేదే.. కానీ.. పాత నోట్లు ఆమె పాలిట ఆపద్భాందవులుగా మారి జీవితాన్ని నిలబెట్టాయి.

ఆపై బేరం జరుగుతుండగా అసలు వ్యవహారం మొదలైంది. మొత్తం 20 లక్షలకు అమ్మాయిని విక్రయించగా, తమ దగ్గర పాత నోట్లే ఉన్నాయంటూ ముఠా సభ్యులు యువతి బంధువులతో చెప్పారు. దానికి ససేమిరా అనటంతో చెక్కు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే ఆ గ్యాప్ లో యువతి అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

వ్యభిచార గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ముఠాతో తన తండ్రి, సోదరుడు ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా సంబంధాలు నడుపుతున్నారని, తనను కూడా విక్రయించేందుకు యత్నించారని, తాను ఎలాగోలా పారిపోయి వచ్చానని ఫిర్యాదు చేసింది. కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులు, వెంటనే యువతి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు. నోట్ల రద్దు ఏమైనా ఒరిగిందా అంటే ఈ ఉదంతం కాస్త ఊరటనిస్తుందనే అనుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Rajasthan Girl  Flesh Trade  escaped  

Other Articles