ముట్టుకోకుండానే రొమాన్స్ పండించడం ఎలాగంటే... | Without touching heroine you can create romance.

Venkaiah naidu romance classes for movies

Venkaiah Naidu, 47th International Film Festival of India (IFFI), IFFI Venkaiah Naidu, Venkaiah Naidu IFFI, Venkaiah Naidu on Movies, Venkaiah Naidu about Romance, Venkaiah Naidu Romance Classes, Union Minister Venkaiah Naidu, Information and broad casting Minister Venkaiah Naidu,Venkaiah Naidu Favorite Movies

Venkaiah Naidu says at 47th IFFI films with vulgar content were "hurting the society. Without touching heroine you can create romance.

కేంద్ర మంత్రి రొమాన్స్ పాఠాలు చెప్పేస్తున్నాడు

Posted: 11/22/2016 12:56 PM IST
Venkaiah naidu romance classes for movies

సరిహద్దులు లేని ఏకైక మతం ఏదైనా ఉంది అంటే అది ఒక్క సినిమానేనని కేంద్ర సాంకేతిక సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపాడు. గోవాలో జరుగుతున్న 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఇఫీ) వేడుకకు హాజరయిన ఆయన అక్కడ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయిందని... ఇలాంటివి సమాజంపై ప్రభావాన్ని చూపిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అశ్లీలతలు లేకుండా... భావోద్వేగాలతో మంచి సినిమాలు తీస్తే, సమాజానికి మంచిదని సూచించారు. సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని చెప్పారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించవద్దని దర్శక నిర్మాతలను కోరారు. హీరోయిన్లను ముట్టుకోకుండానే రొమాన్స్ ను అద్భుతంగా పండిచవచ్చని వెంకయ్య తెలిపారు. పెదవులు, కళ్లు, ముక్కు, చూపులతో కూడా రొమాన్స్ ను పండించవచ్చని చెప్పారు.

మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, నో వన్ కిల్డ్ జెస్సికా, పీకే, ఓ లక్కీ లక్కీ ఓయే, త్రీ ఇడియట్స్ సినిమాలు తన అభిమాన సినిమాలని తెలిపారు. సాలినా 2500 సినిమాలతో అత్యధికంగా సినిమాలను రిలీజ్ చేసే ఇండస్ట్రీగా ఇండియన్ సినిమా రికార్డు సొంతం చేసుకుందని, ప్రపంచదేశాలన్నీ ఓ కన్నేసి ఉంచిన మన సినిమాల ద్వారా అసభ్యకల్చర్ ను పెంచటం మంచి పద్ధతి కాదని మేకర్లకు ఆయన హితవు పలికారు. దానిని ఓ సామాజిక బాధ్యతగా పెంపొందించుకున్నడే అర్థవంతమైన సినిమాలు వస్తాయని ఆయన చెప్పుకోోచ్చాడు.  ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే వెంకయ్య నాయుడు సినీరంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Information and broad casting Minister  Movies Roamnce  

Other Articles