రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం సర్వసాధారణ విషయం. ఒక్కోసారి అవి ఊహించని రీతిలో ఉంటాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత పాలనలో కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసి ఘాటైన విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు, ఇప్పుడు గులాబీ కండువాలు కప్పుకుని దర్జాగా తిరిగేస్తున్నారు. అదనంగా వారికి కీలక బాధ్యతలు బోనస్ గా వస్తున్నాయి కూడా.
ఈ దశలో త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబుతున్నారంటూ కాంగ్రెస్ నేత, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లా ఏర్పాటుకు సుముఖత, ఆపై జిల్లా ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ నేతలతో కలివిడిగా మాట్లాడటం తదితర పరిణామాలు పరిశీలించిన మీడియా హోంమంత్రి పదవి కండిషన్ తో ఆమె కారెక్కే విషయాలను కన్ఫర్మ్ చేశాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో అధికార పక్షం లో చేరబోననే సంకేతాలను ఆమె ఇప్పటికే పరోక్షంగా అందించారు కూడా. ఈ దశలో నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలు దానిని ధృవపరుస్తున్నాయి.
తెలంగాణ సచివాలయాన్ని కూల్చేసి, దాని స్థానే కొత్త కట్టడం కోసం కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు కోర్టులో దీనిపై కేసు నడుస్తుండగానే, శంకుస్థాపన పనులు ప్రారంభించాలని అల్రెడీ డిసైడ్ అయ్యారు కూడా. దీంతో నిన్న కాంగ్రెస్ కీలకనేతలంతా సచివాలయం దగ్గర రోడ్డుపై బైఠాయించటంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ ది ముమ్మాటికి తుగ్లక్ చర్య అంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఎవడి సొమ్మనుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావని, దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారంటూ పరుషమైన పదజాలంతో టీ సీఎంను నిలదీసింది.
సచివాలయాన్ని కూల్చాలంటే ముందు ప్రజాతీర్పు కోరాలన్న ఆమె, అల్లుడు హరీశ్ సీఎం అవుతాడనే భయం కేసీఆర్‌ను వెంటాడుతోందని చెప్పుకొచ్చింది. మిషన్ భగీరథలో నీళ్ళు పారడం దేవుడెరుగు, కేసీఆర్ ఇంటికి వేల కోట్లు పారుతున్నాయని విమర్శించింది. కేసీఆర్‌ను పాతరేసే రోజులు దగ్గర పడ్డాయంటూ వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేసిన అరుణ పార్టీ మారటం లేదంటూ చెప్పేసినట్లే కదా!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more