ఒకే రోజు రెండు సార్లు రాహుల్ గాంధీ అరెస్ట్.. Rahul Gandhi detained for second time

Abused thrashed by police as we tried to meet rahul gandhi son of veteran in video

rahul gandhi, rahul gandhi detained, rml hospital, orop, orop suicide, army jawan suicide, kejriwal, one rank one pension, rahul gandhi, ram manohar lohia hospital, mandir marg police stations, aravind kejriwal, latest news

Congress Vice president Rahul Gandhi being detained twice by Delhi police, after an alleged suicide of an army veteran over the OROP issue

ITEMVIDEOS: ఒకే రోజు రెండు సార్లు రాహుల్ గాంధీ అరెస్ట్..

Posted: 11/02/2016 09:41 PM IST
Abused thrashed by police as we tried to meet rahul gandhi son of veteran in video

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు ఇవాళ రెండు పర్యాయాలు అదుపులోకి తీసుకున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం ఆచరణలోకి రావడం లేదనే మనస్తాపంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ క్రిషన్ గ్రెవాలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లిన రాహుల్ గాంధీని, భాధిత కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు, అస్పత్రి గేట్లు మూసివేసి అయనను నిలువరించారు.  

దీంతో కోపోద్రేకుడైన రాహుల్.. ఇదే కొత్త భారత్ అని వ్యాఖ్యానించారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అనంతరం అక్కడున్న సిఐతో ఆయన వాగ్వాదానికి దిగారు. తనను ఇక్కడకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. తనను అరెస్టు చేశారా.? అని అడిగారు, ఉన్నతాధికారుల అదేశాల మేరకు తాము ఇలా చేశామని చెప్పగా.. అదేశాలిచ్చిన అధికారులు ఎవరని ప్రశ్నించారు., అయితే తన ఎదురుగా వున్న బాధిత కుటుంబ సభ్యులను అరెస్టు చేశారా..? అని ప్రశ్నంచారు.

మృతుడి కుటుంబసభ్యులను కూడా అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్ కు తరలించడానికి సిగ్గు వేయడం లేదా.? దేశానికి సేవలందించిన మాజీ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడితే దానిని కూడా రాజకీయం చేస్తూ పరామర్శించడానికి వచ్చిన నేతలను అరెస్టు చేస్తారా.? మృతుడి కుటుంభసభ్యులను కూడా అరెస్టు చేసి నిర్భందిస్తారా అని అగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించడానికి వచ్చిన నేతలతో మృతుడి కుటుంబసఢ్యులను కూడా కలవనీయకుండా రాజకీయం చేస్తారా..? అని నిలదీశారు.

ఆ తరువాత కొద్ది సేపటికి ఉన్నతాధికారులు అదేశాల మేరకు రాహుల్ గాంధీని పోలీసులు వదిలిపెట్టారు. దీంతో మళ్లీ అస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే రాహుల్ గాంధీని మరోమారు పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. న్యాయం చేయాల్సింది పోయి, మృతుడి కుమారుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ సవాల్ విసిరారు. ఒక యోధుడి కుమారుడి పట్ల అలా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇది సిగ్గుచేటు చర్య అని ఆయన అభివర్ణించారు. రెండోసారి అదుపులోకి తీసుకున్న రాహుల్ ను పోలీసులు  తిలక్ మార్గ్ పీఎస్కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles