వందల ఏళ్ల అదృశ్య మిస్టరీకి సమాధానం దిొరికిందోచ్ | Bermuda Triangle mystery solved

Bermuda triangle mystery solved

Bermuda Triangle mystery solved, Bermuda Triangle mystery, Hexagonal clouds, Bermuda Triangle mystery, clouds behind that mystery, reason for Bermuda Triangle mystery

Bermuda Triangle mystery solved. Hexagonal clouds creating terrifying air bombs.

అదృశ్య మిస్టరీకి కారణం తెలిసిపోయింది

Posted: 10/22/2016 08:23 AM IST
Bermuda triangle mystery solved

అంతుచిక్కని ఆ రహస్యాన్ని ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఛేదించారు. వందల సంవత్సరాలుగా ఆ సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలు, విమానాలు హఠాత్తుగా మాయం అయిపోతుండటం, దానికి కారణం కనుక్కోలేక బుర్ర గొక్కుంటున్న వారికి అసలు విషయం తెలిసిపోయింది. బెర్ముడా ట్రయాంగిల్ అంటూ దశాబ్దాలుగా కొనసాగుతున్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

బెర్ముడా, ఫ్లోరిడా, పుర్టో రికా మూడింటికి మధ్యలో సమీద్ర తీరంలో ఓ ప్రాంతం ఉంది. అక్కడికి రాగానే నౌకలు, విమానాలు మాయమవుతూ ఉంటాయి. ఇది ఇప్పటిదేం కాదు. శతాబ్దాల నాటిది. అంతుచిక్కని ఈ రహస్యానికి చేధించేందుకు చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. 1950లో ఎడ్వర్డ్ అనే శాస్త్రవేత్త ఈ విషయం గురించి ఓ వ్యాసం రాశాడు. దీంతో అందరిలో ఆసక్తి మొదలైంది.

అది ఏలియన్ల పని అని కొందరు, కాదు కాదు... బలమైన అలల ప్రబావంతోనే అని కొందరు వాదించారు. అయితే విమానాలు, నౌకలు మాయమైతే ప్రపంచానికి తెలీకుండా ఉంటుందా? అదంతా ఉత్తదేనని మరికొందరు దానిని కొట్టిపారేశారు. కానీ, వందల సంఖ్యలో చిన్న చిన్న పడవలు, తేలికపాటి ఫ్లైట్లు పదుల సంఖ్యలో మాయం కావటం నిజమేనని తీర ప్రాంత ప్రజలు, అధికారులు ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు. దీంతో బెర్ముడా ట్రయాంగిల్ పై ఓ సస్పెన్స్ నెలకొంది.

చాలా మంది మేధావులు రకరకాల అభిప్రాయాలను వెల్లడించారు. కానీ, శాస్త్రీయంగా ఒక్కరూ నిరూపించలేకపోయారు. చివరికి స్టీవ్ మిల్లర్ అనే ఉపగ్రహా అధ్యయకుడు అక్కడి మేఘాల వల్లే ఇదంతా జరుగుతుందని నిరూపించాడు. షడ్భుజాకార మేఘాలే ఈ మిస్టరీకి కారణమంటూ చెబుతున్నాడు. గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలే ఆ ప్రాంతలోని మేఘాలు ఎయిర్ బాంబ్స్‌తో అనుసంధానమై ఉన్నాయని, వాటి వల్ల బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెను తుపాను వంటి గాలి తీవ్రత ఏర్పడడం వల్ల విమానాలు, నౌకలు నీటిలో మునిగిపోతున్నాయని తెలిపాడు.

ఎగ్జాగోనల్ మేఘాలు గంటకు 106 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను వదులుతుంటాయి. వాటి మూలంగానే అవి ప్రమాదానికి గురౌతున్నాయి. ఈ విషయాన్ని రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు ర్యాండీ అనే సహా శాస్త్రవేత్త వివరించాడు. దీంతో నాసా కూడా కనిపెట్టలేకపోయిన వందల ఏళ్ల నాటి ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bermuda Triangle mystery  Hexagonal clouds  Bomb Winds  

Other Articles