తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది చెప్పండి. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలూ వారిని అక్కున్న చేర్చుకుని, అందలం ఎక్కించేస్తుంటారు. కొత్తగా వచ్చేవారినే కాదు.. తనతో మొదటి నుంచి పోరాటంలో ఉన్న వ్యక్తులను మాత్రం అస్సలు మరిచిపోడు. దీనికి నిదర్శనం ఇప్పుడు చెప్పుకోబోయేది.
కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్.. ఏదైనా పదవి కావాలా?' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డిని ఆప్యాయంగా అడిగిన తీరు ఆసక్తి రేపుతోంది. బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పర్యటించిన కేసీఆర్ తిరుగుప్రయాణంలో భువనగిరిలోని కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సుమారు 30 నిమిషాల పాటు గడిపి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరుసటిరోజు మధ్యాహ్నం తనతో భోజనానికి రావాలని ఆయన కృష్ణారెడ్డిని ఆహ్వానించారు.
దీంతో కృష్ణారెడ్డి తన కుమారుడు వివేక్ రెడ్డిని తీసుకుని మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి నిన్న మధ్యాహ్నం భోజనానికి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా 'కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్. ఏదైనా పదవి కావాలా?' అని అడిగారంట. బదులుగా కృష్ణారెడ్డి 'మీ ఇష్టం. ఏది ఇచ్చినా తీసుకుంటా' అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆపై తెలంగాణ ఉద్యమం తొలి రోజులు, ఆయనతో కలిసి పని చేయటం గురించి ఇరువురు గుర్తుచేసుకున్నారుంటూ మాట్లాడుకున్నారంట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more