మనుషుల కన్నా జంతువులే నయం | Baby elephant jumps in river to rescue her human best friend

Baby elephant jumps in river to rescue her human best friend

Baby elephant jumps in river, Baby elephant rescue her best friend, Thailand baby elephant video, elephant rescue mentor

Baby elephant jumps in river to rescue her human best friend.

ITEMVIDEOS:బెస్ట్ ఫ్రెండ్ కోసం గున్న ఏనుగు సాహసం

Posted: 10/18/2016 12:23 PM IST
Baby elephant jumps in river to rescue her human best friend

ఒక మనిషి ఆప‌ద‌లో ఉన్నాడంటే చాలూ ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందోనని పక్కకు ముఖం తిప్పుకుని వెళ్లే లోకం ఇది. అలాంటి సంద‌ర్భాల్లో మ‌నుషుల క‌న్నా జంతువులే న‌యం అనుకుంటుంటాం. ఆ మాట‌కు పరిపూర్ణ అర్థం చెప్పేలా ఇక్కడ ఓ వీడియో వైరల్ అవుతోంది. తన శిక్షకుడు ప్రమాదంలో ఉన్నాడని భ్రమ పడి అతని కోసం ఆరాటపడి నీళ్లలోకి అమాంతం పరిగెత్తింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నాసరే పట్టించుకోకుండా అతని రక్షించాలని ఆరాటపడింది.

నిజానికి అతను మునిగిపోవటం లేదు, జస్ట్ ఈత కొడుతున్నాడు అంతే. కానీ, తన స్నేహితుడికి ఏం జరుగుతుందోనని ఆందోళనతో ఓ ఏనుగు గ‌బ‌గబా నీటిలోకి వెళ్లి అత‌డిని కాపాడాల‌ని చూసింది. చిన్న ఏనుగు చేసిన ఈ ప‌నికి సోష‌ల్‌మీడియాలో నెటిజ‌న్లు స‌లాం కొడుతున్నారు. తొండంతో, కాళ్లతో త‌న శిక్ష‌కుడిని పట్టుకున్న ఏనుగు అత‌డిని ర‌క్షించాల‌ని చూసింది. ఏనుగుకి, దాని శిక్షకుడికి ఉన్న ఈ బంధాన్ని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.

థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్‌ నేచర్‌ పార్క్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ గున్న ఏనుగు పేరు కామ్ లా. నీళ్లలో గబ గబా నడుచుకుంటూ వెళ్లి సంరక్షకుడు డేర్రిక్‌ ను తొండంతో, కాళ్లతో అతడిని పట్టుకుని ఒడ్డున లాగే యత్నం మీరూ చూడవచ్చు. ఈ వీడియో అక్టోబర్ 12వ తేదీన షేర్ చేయగా, 2.2 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thailand  Baby Elephant  river  saves  life  

Other Articles