సచిన్ బహుమతి భరించలేనంటున్న రియో ఒలంపిక్స్ విన్నర్ | Dipa Karmakar to return BMW gifted by Sachin Tendulkar

Dipa karmakar to return bmw gifted by sachin tendulkar

Dipa Karmakar to return BMW gifted by Sachin, Dipa Karmakar Sachin, Sachin BMW gift return, Sachin costly gift returned, sachin BMWs to Rio winners

Dipa Karmakar to return BMW gifted by Sachin Tendulkar owing to maintenance issues.

సచిన్ గిప్ట్ ను వెనక్కి పంపేసిన దీపా!

Posted: 10/12/2016 11:52 AM IST
Dipa karmakar to return bmw gifted by sachin tendulkar

క్రికెట్ దిగ్గం సచిన్ కు రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన గిప్ట్ గా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుంది. రియో ఒలంపిక్స్ లో జిమ్నాస్టిక్స్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరిన భారతీయ మహిళగా దీపా రికార్డు సృష్టించింది. అయితే పోటీల్లో తృటిలో పతాకం చేజార్చుకుంది. అయినప్పటికీ ఆమె కనబరిచిన ప్రతిభకు దేశం మొత్తం ఆమెకు సలాం కొట్టింది. పోటీల అనంతరం మెడల్స్ సాధించిన సింధు, సాక్షి మాలిక్ తోపాటు దీపాకు కూడా సచిన్ ఈ కార్లను బహుకరించాడు.

అయితే ఆ కారును మెయింటెయిన్ చేసే శక్తి తనకు లేకపోవడంతోనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టం. ఎందుకంటే, అక్కడి రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఎత్తుపల్లాలు కూడా ఎక్కువే. అలాంటి రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడిపితే పాడయ్యే అవకాశాలే ఎక్కువ. 

దీనికితోడు, అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదట. ఈ కారణంగానే బహుమతిని తిరిగిచ్చేయాలనే నిర్ణయానికి దీపా వచ్చిందని ఆమె కోచ్ నంది తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాముండేశ్వరి నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీనికి చాముండేశ్వరి నాథ్ కూడా స్పందించారని... కారుని పంపితే, అందుకు సరిసమానమైన డబ్బును దీపా అకౌంట్లో వేసేందుకు సచిన్ సుముఖత తెలిపినట్లు చాముండీ తెలిపాడంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  Dipa Karmakar  BMW  sachin  returned  

Other Articles