బన్సాల్ ఇంట్లోని లేడీస్ తో సీబీఐ అధికారులు అసభ్యంగా ప్రవర్తించారా? | CBI found key evidences in Bansal Family Suicide

Cbi found key evidences in bansal family suicide

CBI found key evidences in Bansal Suicide Case, Bansal Suicide Case, CBI harassed Bansal Family, Black Money, 30 Bank Lockers and CCTV footage, CBI key evidence in Bansal Case

CBI found key evidences in Bansal Family Suicide Case. Black Money, 30 Bank Lockers and CCTV footage.

బన్సాల్ కేసులో కీలక సాక్ష్యాలు లభ్యం?

Posted: 10/04/2016 09:24 AM IST
Cbi found key evidences in bansal family suicide

సీనియర్ అధికారి బీకె బన్సాల్ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. అవినీతి కేసులో విచారణ సందర్భంగా బన్సాల్, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు వేధించారంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయనను అరెస్ట్ చేసినప్పుడు భార్య, కూతురు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా సెప్టెంబర్ 27న బన్సాల్ మరియు ఆయన కుమారుడు యోగేష్ లు చనిపోయారు.

కాగా, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ కి గురైన సీబీఐకి, వారిని వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. అయితే కోటి రూపాయల అప్పు చెల్లించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ పేర్కొంటున్న సీబీఐ, తమలో కొందరు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్న వాదనను మాత్రం సమర్థించింది.

కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖలో డైరక్టర్ జనరల్ గా విధులు నిర్వహించిన 59 ఏళ్ల బన్సాల్ లంచం ఆరోపణలతో అరెస్టయి సీబీఐ విచారణను ఎదుర్కున్నారు. జూలైలో ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.9 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా పోలీసుల‌కు బ‌న్సాల్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. బ‌న్సాల్‌ను అదుపులోకి తీసుకొని అత‌డి ఇంట్లో సోదాలు చేయ‌గా రూ.60 ల‌క్ష‌ల న‌గ‌దు, 20 ఆస్తుల ప‌త్రాలు, 60 బ్యాంక్ ఖాతాల వివ‌రాలు ల‌భించాయి. ఆ అరెస్ట్ ను అవమానంగా భావించి ఆ మరుసటి రోజే, భార్య కుమార్తె సూసైడ్ చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇప్పుడు బన్సాల్, కొడుకు యోగేష్ లు డిప్రెషన్ తో తనువు చాలించారు.

కాగా, చనిపోయే సమయంలో బన్సాల్ ఐదుగురు సీబీఐ ఆఫీసర్ల పేర్లను లేఖలో పేర్కొనటమేకాదు, ఇంట్లో ఆడవాళ్లను చెప్పుకోలేని భాషలో దూషించారంటూ తెలిపారు. అంతేకాదు ఓ ఇద్దరు అధికారులు కేసు నుంచి పక్కదారి పట్టించేందుకు డబ్బు లంచంగా కోరారని, తమను అన్ని రకాలుగాఇబ్బందులకు గురిచేయటం మూలంగానే చనిపోతున్నామని రాసి ఉంది.

అయితే సీబీఐ మాత్రం ఆ కుటుంబంపై ఉన్న అవినీతి ఆరోపణలను సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు సిద్ధమైపోతుంది. బన్సాల్ అరెస్టయిన మరుసటి రోజు ఆయన కుమారుడు, మరియు భార్య బ్యాంకు లాకర్ల నుంచి డబ్బును డ్రా చేయటం(30 బ్యాంకు లాకర్లు), సీపీ పుటేజీలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు విచారణ చేపట్టిన ఆర్పీ అగర్వాల్ నేతృత్వంలోని సీబీఐ బృందం అన్ని కసరత్తులు సిద్ధం చేసింది.

మరోవైపు బన్సాల్ కుటుంబం ఆత్మహత్య కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. బన్సాల్ రాసిన ఆత్మహత్య నోట్ లో పేర్కొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా తెలియజేయాలని ఆ నోటీసులో పేర్కొంది. దీనిపై 48 గంటలలోగా స్పందించాలని డీసీడబ్ల్యు ఆ నోటీసులో ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bansal Family Suicide  Key Evidences  CCTV footage  

Other Articles